
న్యూఢిల్లీ : దీర్ఘకాల డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ దేశవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు నిర్వహించనున్న సమ్మె నేపథ్యంలో... విద్యుత్తు, బ్యాంకింగ్, రైల్వే సేవలు దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ముప్పు ఉన్నప్పటికీ రోడ్డు, రవాణా, విద్యుత్తు కార్మికులు సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు. సోమ, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకు శాఖల్లో సేవలు ప్రభావితమయ్యే అవకాశాలున్నాయి. ప్రభుత్వ విధానాలకు నిరసనగా... కేంద్ర కార్మికసంఘాల సంయుక్త వేదిక సోమ, మంగళవారాల్లో దేశవ్యాప్త సమ్మె(భారత్ బంద్) కు పిలుపునిచ్చింది. కేంద్ర కార్మిక సంఘాలు, సెక్టోరల్ ఫెడరేషన్లు, సంఘాల వేదిక ఇటీవల న్యూఢిల్లీలో రెండు రోజుల అఖిల భారత సమ్మె కోసం సమీక్షించింది. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్(ఎస్మా) ముప్పు పొంచి ఉన్నప్పటికీ రోడ్డు మార్గాలు, రవాణా కార్మికులు, విద్యుత్ కార్మికులు సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఈపీఎఫ్ వడ్డీ రేటు పెంపు పెట్రోల్, ఎల్పీజీ, కిరోసిన్, సీఎన్జీ తదితరాలపై ఆకస్మిక పెంపు తదితరాలకు నిరసనగా ఈ సమ్మె జరగనుంది.
ఇవి కూడా చదవండి