వారికి మాత్రమే మాస్క్‌లు ధరించకుండా మినహాయింపు

ABN , First Publish Date - 2022-04-23T02:08:35+05:30 IST

వారికి మాత్రమే మాస్క్‌లు ధరించకుండా మినహాయింపు

వారికి మాత్రమే మాస్క్‌లు ధరించకుండా మినహాయింపు

న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో ప్రయాణించే వారు ముఖానికి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అని ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. అయితే ప్రైవేట్ వాహనాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని ఢిల్లీ సర్కారు పేర్కొంది. కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి మాస్కులు ధరించని వారికి రూ. 500 జరిమానా విధించబడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.


మరోవైపు దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రమక్రమంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని.. కరోనా తగ్గిపోయిందని భావించకూడదని చెప్పారు.

Updated Date - 2022-04-23T02:08:35+05:30 IST