hijabపై బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-02-17T16:09:13+05:30 IST

దేశంలో తాజాగా రాజుకున్న హిజాబ్ వివాదంపై భోపాల్ బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు....

hijabపై బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యలు

భోపాల్(మధ్యప్రదేశ్): దేశంలో తాజాగా రాజుకున్న హిజాబ్ వివాదంపై భోపాల్ బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.విద్యాసంస్థల్లో యువతులు, బాలికలు హిజాబ్ ధరించడంపై భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలను ఉద్ధేశించి ప్రగ్యాసింగ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదని, ఇంట్లో ఇబ్బందులు ఎదుర్కొనే వారు ఇళ్లలో హిజాబ్ ధరించాలని ఆమె కోరారు.కర్ణాటక రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్ వివాదం రాజుకున్న నేపథ్యంలో ప్రగ్యాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.విద్యార్థులు స్కూల్‌కి వెళ్లేటప్పుడు స్కూల్ యూనిఫాం ధరించి విద్యా సంస్థల క్రమశిక్షణ పాటించాలని కోరారు.గురుకుల శిష్యులు కాషాయ కండువా ధరిస్తుంటారని ఆమె చెప్పారు.


హిజాబ్ నెరిసిన వెంట్రుకలను దాచుకోవడానికి ఉపయోగిస్తారని ఆమె అన్నారు.‘‘హిజాబ్ ఒక పర్దా. మిమ్మల్ని చెడు దృష్టితో చూసే వారిపై పర్దాను ఉపయోగించాలి. కానీ హిందువులు స్త్రీలను పూజించినందున వారిని చెడు దృష్టితో చూడరు’’ అని ప్రగ్యాసింగ్ చెప్పారు.‘‘ఇక్కడ స్త్రీలను పూజించడం సనాతన సంస్కృతి. స్త్రీల స్థానానికి ప్రాధాన్యం ఉన్న ఈ దేశంలో హిజాబ్ ధరించడం అవసరమా? భారతదేశంలో హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదు.’’ అని బీజేపీ ఎంపీ వివరించారు.‘‘మదర్సాలలో హిజాబ్ ధరించండి,కానీ మీరు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలల క్రమశిక్షణకు భంగం కలిగిస్తే.. దానిని సహించేది లేదు’’ అని ప్రగ్యా సింగ్ ఠాకూర్ హెచ్చరించారు.


Updated Date - 2022-02-17T16:09:13+05:30 IST