ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేనివారిని పక్కనపెడతాం: సీఎం జగన్

ABN , First Publish Date - 2022-04-28T00:03:16+05:30 IST

ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేనివారిని పక్కనపెడతాం: సీఎం జగన్

ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేనివారిని పక్కనపెడతాం: సీఎం జగన్

తాడేపల్లి: మంత్రులు, జిల్లా అధ్యక్షులతో సీఎం జగన్ భేటీ ముగిసింది. పలు అంశాలపై వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. మే 2 నుంచి 'ఇంటింటికీ వైసీపీ' కార్యక్రమం ఉంటుందని తెలిపారు. జులై 8న వైసీపీ ప్లీనరీ ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. మే 10 నుంచి గడపగడపకు వైసీపీ కార్యక్రమం, పాత మంత్రులు, జిల్లా అధ్యక్షులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. రెండేళ్లలో ఎన్నికలకు వెళ్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు.


ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్‌ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేనివారిని పక్కనబెడతానని సీఎం జగన్ స్పష్టం చేశారు. రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను మంత్రులు కలుపుకు వెళ్లాలని, ఎవరికైనా పార్టీనే సుప్రీంమన్నారు. గెలిస్తేనే మంత్రి పదవి అని,గెలిచేందుకు కావాల్సిన వనరులు సమకూరుస్తానని జగన్ తెలిపారు. ఎవ్వరూ తాము ప్రత్యేకం అనుకోవడానికి వీల్లేదని, 175కి 175 సీట్లు ఎందుకు గెలవమని సీఎం జగన్ ప్రశ్నించారు.

Updated Date - 2022-04-28T00:03:16+05:30 IST