నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు
జిల్లా అంతటా బీజేపీ నిరసనలు
నిర్మల్ కల్చరల్, జనవరి 27 : నిజామాబాద్ ఎంపీ అరవింద్, బీజేపీ కార్యకర్తలపై బుధవారం జరిగిన దాడికి నిరసనగా జిల్లా అంతటా గురువారం కార్యక్రమాలను బీజేపీ శ్రేణులు నిర్వహించాయి. టీఆర్ఎస్ గుండాలను అరెస్ట్ చేయా లని బీజేపీ డిమాండ్ చేసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఎంపీ అరవింద్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు రావుల రాంనాథ్ మాట్లాడుతూ... రాష్ర్టాల్లో బీజేపీ ఎదుగుదల చూసి ఓర్వలేక అధికార టీఆర్ఎస్ పార్టీ భౌతిక దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. కరీంనగర్లో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 317 ఉత్తర్వులపై ఆందోళన చేస్తే అరెస్ట్ చేయడం ఇటీవల ఎంపీ అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనుల పరిశీలనకు వెళ్తుండగా టీఆర్ఎస్ గుండాలు రైతుల ముసుగులో దాడికి పాల్పడ్డారన్నారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుండి ఇచ్చిన ఆదేశం మేరకు టీఆర్ఎస్ ఈ దాడు లకు పాల్పడిందన్నారు. పోలీసులు అధికార పార్టీకి విధేయులుగా పని చేస్తూ ప్రేక్షకపాత్ర వహించారన్నారు. కుటుంబపార్టీకి వత్తాసు పలుకుతూ దాడులను ప్రోత్సహించారన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎంపీ అరవింద్‌పై దాడికి కారణమని వెంటనే జీవన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాయ కులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మెడి సెమ్మె రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, అయ్యన్నగారి భూమయ్య, సాధం అరవింద్, అలివేలు నిరసన ప్రద ర్శనలో పాల్గొన్నారు.
కుంటాల : ఎంపీ అరవింద్‌పై దాడిని ఖండిస్తున్నామని మండల బీజేపీ అధ్యక్షులు గుడ్డేటి నర్సయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసి మాట్లాడారు. ఎంపీ అరవింద్‌పై దాడి చేసిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు జక్కుల గజేందర్, శివ, తదితరులున్నారు.
కుభీర్ : ఎంపీ ధర్మపురి అరవింద్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని బీజేపీ నాయకులు ఏశాల దత్తాత్రి అన్నారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో మెమోరాండం అందజేసిన అనంతరం మాట్లాడుతూ ఎంపీ అరవింద్‌పై దాడికి పాల్పడిన వారిని గుర్తించి వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గంగాధర్, మల్లేష్, లింబాద్రి, గణపతి, ప్రవీణ్, నరేశ్ తదితరులున్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ఖానాపూర్, జనవరి 27 : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై టీఆర్ ఎస్ నాయకుల దాడిని నిరసిస్తూ గురువారం ఖానాపూర్‌లో బీజేపి శ్రేణులు ఆందోళకు దిగారు. ఈ సందర్భంగా పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్పై పెరుగుతున్న ప్రజావ్యతిరకతతోనే టీఆర్ఎస్ నాయకులు ఇలా భౌతికదాడులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఎంపీపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపి నాయకులు సంతోష్, భుచ్చన్న, రాము, ఆనంద్, శ్రవణ్, రవి, మనోజ్, రమేష్, లక్ష్మన్, స్వామి, ప్రశాంత్ తదితరులున్నారు.