బ్రిటిషర్ల బూట్లు శుభ్రం చేసినవాళ్లు దేశభక్తి గురించి చెప్తున్నారు: ముఫ్తి

ABN , First Publish Date - 2021-12-22T23:24:25+05:30 IST

ఈ దేశ స్వాతంత్ర్యం కోసం జవహార్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్ సయ్యద్ అహ్మద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌లతో సమ పోరాటం చేసిన మహ్మద్ అలీ జిన్నాను మనం ఈరోజు విమర్శిస్తున్నాం. ఎందుకంటే ఆయన మీద మనకు ఒక ఫిర్యాదు ఉంది. ఈ దేశ విభజనకు కారకుడని ఆయన పక్కన పెట్టేశాం..

బ్రిటిషర్ల బూట్లు శుభ్రం చేసినవాళ్లు దేశభక్తి గురించి చెప్తున్నారు: ముఫ్తి

శ్రీనగర్: మోదీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీపై పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనని వారు, బ్రిటిషర్ల బూట్లు శుభ్రం చేసిన వారు ఈ రోజు దేశ ప్రజలకు దేశభక్తి గురించి లెక్చర్లు ఇస్తున్నారని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం శ్రీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మెహబూబా మాట్లాడుతూ బీజేపీని జిన్నాతో పోల్చారు.


‘‘ఈ దేశ స్వాతంత్ర్యం కోసం జవహార్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్ సయ్యద్ అహ్మద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌లతో సమ పోరాటం చేసిన మహ్మద్ అలీ జిన్నాను మనం ఈరోజు విమర్శిస్తున్నాం. ఎందుకంటే ఆయన మీద మనకు ఒక ఫిర్యాదు ఉంది. ఈ దేశ విభజనకు కారకుడని ఆయన పక్కన పెట్టేశాం. హిందూ-ముస్లింల ప్రాతిపదికన జిన్నా ఈ దేశాన్ని విడదీశారు. కానీ ఈరోజు దేశంలో జరుగుతున్నదేంటి? ఎంతో మంది జిన్నాలు ఈ దేశంలోని ప్రజలను అదే మత ప్రాతిపదికన విడదీస్తున్నారు. స్వాతంత్ర్య పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు, బ్రిటిషర్ల బూట్లు శుభ్రం చేసిన వాళ్లు ఈరోజు మనకు దేశభక్తి గురించి పాఠాలు చెబుతున్నారు’’ అని మెహబూబా తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Updated Date - 2021-12-22T23:24:25+05:30 IST