హై వాల్యుయేషన్‌లో ఉన్నా...

ABN , First Publish Date - 2021-10-26T22:51:08+05:30 IST

సెప్టెంబరు త్రైమాసికంలో బలమైన నంబర్లను మార్కెట్‌ ముందుంచిన తర్వాత... టీవీఎస్ మోటార్ షేర్లు టాప్‌ గేర్‌లో దూసుకువెళ్లాయి.

హై వాల్యుయేషన్‌లో ఉన్నా...

హైదరాబాద్ : సెప్టెంబరు త్రైమాసికంలో బలమైన నంబర్లను మార్కెట్‌ ముందుంచిన తర్వాత... టీవీఎస్ మోటార్ షేర్లు టాప్‌ గేర్‌లో దూసుకువెళ్లాయి. సోమవారం ట్రేడింగ్‌లో లాభాలను ఒకింత  కోల్పోయినప్పటికీ... ఈ రోజు మాత్రం దాదాపు 2 % మేర పెరగడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్‌(ఈవీ) సెగ్మెంట్‌లో, ప్రత్యేకంగా ఓ అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలన్న కంపెనీ నిర్ణయం, ఉత్పత్తి వృద్ధి, సామర్థ్య విస్తరణ కోసం పెట్టుబడుల అంశాలను మార్కెట్‌ అనుకూలంగా చూసింది. దీనికితోడు దేశీయంగా, ఎగుమతి సెగ్మెంట్లలో అమ్మకాలు పెరుగుతాయని, స్టాక్ ప్రైస్‌కు మరింత బలాన్నిస్తుందని భావిస్తున్నారు.


Updated Date - 2021-10-26T22:51:08+05:30 IST