కరోనా కేసులు వెయ్యి దాటేశాయ్‌

ABN , First Publish Date - 2021-04-17T06:50:26+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభణ మరింత పెరిగింది. కొవిడ్‌ మహమ్మారి పల్లెలకూ పాకింది.మంగళ, బుధవారాల తరహాలోనే గురు, శుక్రవారాల నడుమ 24 గంటల్లో కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా కేసులు, మరణాలూ జిల్లాలో నమోదయ్యాయి.

కరోనా కేసులు   వెయ్యి దాటేశాయ్‌

-వైరస్‌తో ఐదుగురి మృత్యువాత

తిరుపతి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభణ మరింత పెరిగింది. కొవిడ్‌ మహమ్మారి పల్లెలకూ పాకింది.మంగళ, బుధవారాల తరహాలోనే గురు, శుక్రవారాల నడుమ 24 గంటల్లో కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా కేసులు, మరణాలూ జిల్లాలో నమోదయ్యాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 1024 మందికి కరోనా సోకగా వైరస్‌ బారిన పడి ఐదుగురు మరణించారు. తాజా కేసులు, మరణాలతో ఇప్పటి వరకూ జిల్లాలో నమోదైన పాజిటివ్‌ కేసులు 98032కి చేరుకోగా మరణాల సంఖ్య 909కి పెరిగింది. మరోవైపు జిల్లాలో యాక్టివ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా మరింత ఎగబాకి శుక్రవారం ఉదయం 9 గంటల సమయానికి 6428కి చేరుకుంది. కొత్తగా గుర్తించిన కేసుల్లో తిరుపతి నగరంలోనే 339, తిరుపతి రూరల్‌ మండలంలో 85, చిత్తూరులో 77 వున్నాయి. శ్రీకాళహస్తి మండలంలో 40, పాకాల, పుంగనూరుల్లో 37, చంద్రగిరిలో 32, పీలేరులో 31, రేణిగుంటలో 27, జీడీనెల్లూరులో 21, గుడిపాల, మదనపల్లెల్లో 18, కుప్పంలో 17, తవణంపల్లెలో 16, పుత్తూరులో 15, ములకలచెరువు, పూతలపట్టు, రామచంద్రాపురాలలో 12 వంతున, ఐరాల, కార్వేటినగరాల్లో 10 వంతున, పెనుమూరులో 9, బైరెడ్డిపల్లె, చిన్నగొట్టిగల్లు, పెద్దపంజాణి, వెదురుకుప్పం మండలాల్లో 7 వంతున, కలకడ, కలికిరి, రొంపిచెర్ల, సోమల, తొట్టంబేడుల్లో 6 వంతున, బంగారుపాలెం, గుడుపల్లె మండలాల్లో 5 వంతున, చౌడేపల్లె, గుర్రంకొండ, కురబలకోట, నగరి, పులిచెర్ల, సత్యవేడు, శ్రీరంగరాజపురం, వడమాలపేట, ఏర్పేడు మండలాల్లో 4 వంతున, బి.కొత్తకోట, బీఎన్‌ కండ్రిగ, నాగలాపురం, నారాయణవనం, పలమనేరు, రామకుప్పం, శాంతిపురం, సదుం, తంబళ్ళపల్లె, వి.కోట మండలాల్లో 3 వంతున, కేవీపల్లె, రామసముద్రం, వరదయ్యపాలెం, ఎర్రావారిపాలెం, యాదమరి మండలాల్లో 2 వంతున, గంగవరం, కేవీబీపురం, నిండ్ర, వాల్మీకిపురం, విజయపురం మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.కరోనా రోగుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ ట్రేసింగ్‌లో వైద్య ఆరోగ్య శాఖ విఫలం కావడంతోనే కేసుల సంఖ్య పెరుగుతోందన్న విమర్శలొస్తున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు ఆలస్యమవుతుండడం కూడా వైరస్‌ ఉధృతికి మరో కారణమంటున్నారు.  


కాణిపాక ఆలయ సిబ్బందికి కరోనా

ఐరాల(కాణిపాకం), ఏప్రిల్‌ 16: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పనిచేసే అర్చకులకు, వాహనాలకు పూజ చేసే చోట పని చేసే భజంత్రీలకు కరోనా సోకింది. ఇద్దరు అర్చకులు, ముగ్గురు భజంత్రీలు వైరస్‌ బారినపడ్డారు. దీనిపై ఆలయానికి వచ్చే భక్తులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆలయ సిబ్బందికి  రెండో దఫా కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతుండటంతో స్థానిక ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-04-17T06:50:26+05:30 IST