మడ్డువలసకు ముప్పు!

ABN , First Publish Date - 2021-06-08T04:13:32+05:30 IST

మడ్డువలస రిజర్వాయర్‌కు గడ్డు పరిస్థితి వెంటాడుతూనే ఉంది. ప్రధానంగా సిబ్బంది కొర త వేధిస్తోంది. దీంతో ప్రాజెక్టు నిర్వహణ ప్రశ్నార్థ కమవుతోంది. వర్షాకాలం సమీపిస్తున్న వేళ..

మడ్డువలసకు ముప్పు!
మడ్డువలస రిజర్వాయర్‌



 వెంటాడుతున్న సిబ్బంది కొరత

 మరమ్మతులకు గురైన షట్టర్లు

 నీటిమట్టం పెరిగితే ముంపు తప్పదు

(వంగర)

మడ్డువలస రిజర్వాయర్‌కు గడ్డు పరిస్థితి వెంటాడుతూనే ఉంది. ప్రధానంగా సిబ్బంది కొర త వేధిస్తోంది. దీంతో ప్రాజెక్టు నిర్వహణ ప్రశ్నార్థ కమవుతోంది. వర్షాకాలం సమీపిస్తున్న వేళ.. వర ద పోటెత్తితే ముంపు ముప్పు పొంచి ఉంది. రిజ ర్వాయర్‌ పరిసరాల్లో నిత్యం పర్యవేక్షణ కోసం కనీసం 18 మంది సిబ్బంది ఉండాలి. కానీ ఇక్క డ లస్కరుగా ఒక నాలుగో తరగతి ఉద్యోగి, మరొ కరు ఔట్‌సోర్సింగ్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో పనిచేసిన సిబ్బంది పదవీ విరమణ పొందగా.. వారి స్థానంలో ఎవరినీ నియమించ లేదు. ఎలక్ర్టీషియన్‌ సైతం లేరు. నదికి వరద పోటెత్తితే అప్రమత్తంగా వ్యవహరించి షట్టర్లు (తలుపులు) తీసే నాథుడే లేడు. రిజర్వాయర్‌ కు 11 ప్రధాన గేట్లు ఉండగా.. వీటితో మూడు మరమ్మతులకు గురయ్యాయి. 8వ గేటు రోప్‌ తెగిపోగా, మరో రెండు గేట్లకు స్టాపర్‌లు పనిచేయడం లేదు. గేట్లకు విద్యుత్‌ సరఫరాలో కూడా చాలావరకు లూపు (తాత్కాలిక) వైరింగ్‌ స్థానిక ఎలక్ర్టీషియన్లు చేశారు. ప్రస్తుతం రిజ ర్వాయర్‌కు ఇన్‌ఫ్లో పెరుగుతుండడంతో సమీప గ్రామస్థులు గజగజ లాడుతున్నారు. ఏ క్షణాన వరదలు వస్తాయేమోనని భయాందోళన చెందు తున్నారు. రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 65 మీటర్లు కాగా... ఇప్పటికే 64.20 మీటర్లకు చే రింది. ఇన్‌ఫ్లో క్రమంగా పెరగడంతో మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయికి నీరు చేరే అవకాశం ఉం ది. వరదలు ఒక్కసారిగా వస్తే అన్ని గేట్లు తెరిచి లక్ష క్యూసెక్కుల వరకు నీరు నాగావళికి విడుద ల చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక్కసారిగా వరద పోటెత్తితే తమకు ముంపు ముప్పు తప్పదని ఈ ప్రాంతవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.


నివేదికలు పంపాం..

మడ్డువలస రిజర్వాయర్‌ ప్రాంతంలో 18 మందికి పైగా విధుల్లో ఉండాలి. కానీ కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పదవీ విరమణ చేసినవారి సేవలను కూడా వినియోగిస్తున్నాం. కొత్తవారి ని నియమించడం లేదు. రిజర్వాయర్‌ గేట్లు, ఇత రత్ర వాటి మరమ్మతుల కోసం రూ.48 లక్షలతో అంచనాలు రూపొందించి ప్రభుత్వా నికి నివేదించాం. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడతాం. ప్రస్తుతం రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోంది.

-గణేష్‌, ఏఈ, మడ్డువలస




Updated Date - 2021-06-08T04:13:32+05:30 IST