అంబానీ కుటుంబానికి బెదిరింపు కాల్స్‌

ABN , First Publish Date - 2022-08-16T06:48:46+05:30 IST

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ కుటుంబానికి సోమవారం గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. ఓ వ్యక్తి ముంబైలోని గిర్గావ్‌..

అంబానీ కుటుంబానికి బెదిరింపు కాల్స్‌

ముంబై, ఆగస్టు 15: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ కుటుంబానికి సోమవారం గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. ఓ వ్యక్తి ముంబైలోని గిర్గావ్‌ ప్రాంతంలో ఉన్న రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌లోని పబ్లిక్‌ ఫోన్‌కు కాల్‌ చేసి ముకేశ్‌ అంబానీ కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరించాడు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మూడు, నాలుగుసార్లు వచ్చిన ఈ ఫోన్‌ కాల్‌పై ఆస్పత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ముంబై నగర పోలీసులు దహిసార్‌ ప్రాంతంలో ఓ అనుమానితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతనికి మతిస్థిమితం సరిగా లేనట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై డీబీ మార్గ్‌ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-16T06:48:46+05:30 IST