చిట్టమూరు, జనవరి 21 : మండలంలోని కొత్తగుంట సబ్‌స్టేషన్ సమీపంలో గురువారం కారును మోటార్ సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. చెన్నై నుంచి మల్లాం వెళ్తున్న వ్యక్తులు సబ్‌స్టేషన్ వద్ద కారు నిలిపారు. మన్నెమాలకు చెందిన ముగ్గురు బాలురు మోటార్ సైకిల్‌పై వేగంగా వెళ్తూ కారును వెనుక నుంచి ఢీకొట్టడంతో బాలురు గాయపడ్డారు. వారిని 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.