ఉదయం 5.30కే కారు తీసుకుని నలుగురు కుర్రాళ్లు బయలు దేరారు.. హైవేపై డ్రైవింగ్ నేర్చుకున్నారు.. ఆ తరువాత జరిగిందో దారుణం..

Sep 19 2021 @ 18:19PM

ఇంటర్నెట్ డెస్క్: డ్రైవింగ్ నేర్చుకునేందుకు నలుగురు కుర్రాళ్లు ఉదయాన్నే బయలు దేశారు. దాదపు గంట పాటు కారు నడపడం నేర్చుకున్నారు. ఆ తరువాత అకస్మాత్తుగా జరిగిందో దారుణం. దీంతో నలుగురు కుర్రాళ్లు ఘటనాస్థలంలోనే మరణించారు . రాజస్థాన్‌ రాష్ట్రం హనుమాన్‌ఘర్ జిల్లాకు చెందిన నీరజ్(17), హేమంత్(17), రజత్(20) ఆదివారం ఉదయం 5.30కు ఐ-10 కారులో డ్రైవింగ్ నేర్చుకునేందుకు ఇంటి నుంచి బయలు దేరారు. రజత్ కారు నడుపుతుండగా.. నీరజ్, హేమంత్ వెనుక సీట్లో కూర్చున్నారు. వీరికి స్నేహితుడైన రుద్రాక్ష కూడా వారి వెంట బయలు దేశారు. హైవేకు పక్కనే ఉన్న లింక్‌ రోడ్డులో రజత్ మిగతా ముగ్గురికీ గంట పాటు డ్రైవింగ్ నేర్పాడు. ఆ తరువాత.. వారు ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

అయితే..వారు హనుమాన్‌ఘర్-జైపూర్ హైవేపై ప్రయాణిస్తుండగా అనూహ్యంగా ప్రమాదం జరిగిపోయింది. ఎదురుగా వస్తున్న  లారీ వారి కారును ఢీకొనడంతో..కారులో ఉన్న నలుగురు యువకుల దేహాలు నుజ్జునుజ్జైపోయాయి. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం కారణంగా పెద్ద శబ్దం రావడంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లెకపోయింది. మరోవైపు..ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ డ్రైవర్ పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుల మృత దేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.