మూడు రోజులు ఊటీలో సీఎం, గవర్నర్‌

Published: Fri, 13 May 2022 10:54:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మూడు రోజులు ఊటీలో సీఎం, గవర్నర్‌

చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మూడు రోజులపాటు ఊటీలో గడుపనున్నారు. ఆ సందర్భం గా పోలీసు ఉన్నతాధికారులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నారు. ఊటీ బోటానికల్‌ గార్డెన్‌లో ఫలపుష్ప ప్రదర్శన ప్రారంభించేందుకు స్టాలిన్‌ ఈ నెల 19 సాయంత్రం ఊటీకి బయలుదేరివెళుతున్నారు. మరుసటి రోజు ఆయన ఫలపుష్ప ప్రదర్శన ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఊటీ ఆవిర్భవించి రెండు శతాబ్దాలు పూర్తి చేసుకోనున్న సందర్భంగా స్మారక చిహ్నాన్ని ప్రారంభిస్తారు. ఈ నెల 21న ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు ఆయన సహాయాలు పంపిణీ చేస్తారు. ఇక గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఈ నెల 15న బయలుదేరి ఊటీకి వెళ్తున్నారు. ఈ నెల 24 వరకూ ఆయన అక్కడే బసచేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 19 నుంచి 21 వరకూ అటు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు, ఇటు గవర్నర్‌ ఆర్‌ఎన్‌రవికి పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. మూడు రోజులపాటు గవర్నర్‌, ముఖ్యమంత్రి ఊటీలో బస చేసినా ఇద్దరూ కలుసుకునే అవకాశం లేదని తెలుస్తోంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.