Advertisement

మూడుకు చేరిన మృతులు

Apr 22 2021 @ 22:56PM

 అచ్చంపేట అర్బన్‌, ఏప్రిల్‌ 22: రోడ్డు ప్రమాద మృతులు మూడు కు చేరింది. శ్రీశైలం- హైదరాబాద్‌ జాతీయ రహదారి చెన్నారం సమీ పంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తి గురువారం మృతి చెందడంతో అ కు టుంబాలలో విషాదం నెలకొన్నది. పోలీసులు, కుంటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట మండలం బోల్గట్‌పల్లికి చెందిన చందు(25), రవీందర్‌ (27) ద్విచక్ర వాహనంపై మైసిగండి నుంచి సొంత గ్రామానికి వస్తున్నారు. మరో ద్విచక్ర వాహనంపై సింగారం గ్రామానికి సుందరయ్య, సింగారం గ్రామానికి చెందిన సాయిబాబులు డిండి వైపు వెళుతుండగా చెన్నారం స్టేజి దగ్గర ఎదురెదురుగా ఢీకొన్నాయి. చందునాయక్‌ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన రవీందర్‌ను హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సాయిబాబ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు వారు తెలిపారు. వీరి మృతితో ఆయా గ్రామాలలో విషాదచాయలు నెలకొన్నాయి. రవీందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చందుకు ఇంకా విహవాం కాలేదు. సాయిబాబకు ఇద్దరు కూమా ర్తెలు, భార్య ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రదీప్‌ కుమార్‌ తెలిపారు.


Follow Us on:
Advertisement