నిర్మాణంలో ఉన్న గోడ కూలి ముగ్గురి దుర్మరణం

Published: Wed, 23 Mar 2022 08:46:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నిర్మాణంలో ఉన్న గోడ కూలి ముగ్గురి దుర్మరణం

ఘజియాబాద్: నిర్మాణంలో ఉన్న ప్రహరీగోడ కూలి ముగ్గురు మరణించిన దుర్ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఘజియాబాద్ నగరంలోని డీఏవీ చౌక్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు.మంగళవారం రాత్రి నుంచి ప్రహరీగోడ నిర్మాణపనులు సాగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.ప్రహరీ గోడ కూలిన వెంటనే సహాయ సిబ్బంది హుటాహుటిన వచ్చి శిథిలాల కింద ఉన్న మరో ఇద్దరు కార్మికులను కాపాడారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు కార్మికులను ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్, అగ్నిమాపకసిబ్బంది, పోలీసులు శిథిలాలను తొలగిస్తున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.