ltrScrptTheme3

NRI లు తప్పకుండా తెలుసుకోవాల్సిన మూడు FEMA నిబంధనలివే..

Sep 26 2021 @ 11:30AM

ఎన్నారై డెస్క్: విదేశాల్లో ఉంటూ పనిచేసే వారికి(ఎన్నారైలకు) ఆర్థిక లావాదేవీలు అంత సులభమైన పని కాదు. అంటే ఎన్నారైలు స్వదేశం నుంచి నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలన్న లేక విదేశాల నుంచి స్వదేశంలో ఉన్న తమవారికి డబ్బులు పంపిచాలన్న భారత ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. ముఖ్యంగా మనీలాండరింగ్, ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ తదితర వాటిని కట్టడి చేసేందుకు ఈ నిబంధనలు విధించింది. ఇవన్నీ కూడా విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) కిందికి వస్తాయి. కనుక ఎన్నారైలు ఈ ఫెమా చట్టానికి సంబంధించిన ప్రధానమైన మూడు నిబంధనలను తప్పకుండా తెలుసుకోవాలి.


అసలు 'ఫెమా' ఏంటి?

1999లో విదేశీ చెల్లింపులు, వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు విదేశీ మారక నిర్వహణ చట్టాన్ని(ఫెమా) భారత ప్రభుత్వం తీసుకువచ్చింది. భారత విదేశీ మారక మార్కెట్ అభివృద్ధి, నిర్వహణను ప్రోత్సహించడానికి ఈ చట్టం రూపొందించబడింది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే భారత్‌కు విదేశాల నుంచి వచ్చే కరెన్సీని కంట్రోల్ చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిందే ఫెమా. అందువల్ల ఎన్నారైలు విదేశాల నుంచి భారతదేశానికి డబ్బు పంపే విషయంలో ఈ చట్టానికి కట్టుబడి ఉండాలి. ఈ చట్టం భారతదేశ వ్యాప్తంగా వర్తిస్తుంది. అలాగే విదేశాల్లోని భారత కార్యాలయాలు, మనోళ్లు నడుపుతున్న ఏజెన్సీలకు కూడా ఇది వర్తిస్తుంది.

ఎన్నారైలు తెలుసుకోవాల్సిన మూడు 'ఫెమా' నిబంధనలివే..  

1. బ్యాంకు ఖాతాల నిర్వహణ: ఎన్నారైలకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు ఉంటాయనేది తెలిసిందే. ఏ బ్యాంకులోనైనా ఖాతా తీసుకోవచ్చు. ఎన్నారైలకు బ్యాంకులు కేటాయించే బ్యాంకు ఖాతాలు మూడు రకాలు. ఎన్‌ఆర్‌ఓ, ఎన్ఆర్ఈ, ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతా. 

* ఎన్‌ఆర్‌ఓ ఖాతా: నాన్-రెసిడెంట్ ఆర్డినరీ రూపీ అకౌంట్. ఇది భారతదేశం బయటి నుంచి చెల్లింపులకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ఖాతాను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఎన్నారైలు సంయుక్తంగా నిర్వహించవచ్చు. అయితే, ఈ ఖాతా ద్వారా పంపిన నిధులు మరొక దేశానికి తిరిగి పంపించడానికి వీలుండదు. 

* ఎన్ఆర్ఈ ఖాతా: నాన్-రెసిడెంట్(ఎక్స్ట్‌ర్నల్) రూపీ అకౌంట్. ఈ ఖాతా ద్వారా భారతదేశానికి వెలుపల నుండి నగదు బదిలీ చేయడానికి వీలుంటుంది. ఈ ఖాతాలో ఉన్న మొత్తం ఎన్నారై నివాస దేశానికి తిరిగి పంపించుకోవచ్చు. అంతేగాక ఈ ఖాతాలో సంపాదించిన ఆదాయానికి పన్నుల నుంచి మినహాయింపు కూడా ఉంటుంది.

* ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతా: ఫారిన్ కరెన్సీ(నాన్-రెసిడెంట్) అకౌంట్. ఈ ఖాతా ద్వారా ఎన్నారైలు ఏ ఫారిన్ కరెన్సీనైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకటి నుంచి ఐదేళ్ల కాలపరిమితితో ఈ ఖాతా అందుబాటులో ఉంటుంది. పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. 


2. ఆర్థిక పెట్టుబడులు: ఇక పెట్టుబడుల విషయానికి వస్తే ఎన్నారైలు స్వదేశీ, విదేశీ లావాదేవీల ద్వారా చాలా వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, ఫెమా చట్టం ప్రకారం పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్(పీపీఎఫ్) పథకాల్లో లేదా చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఎన్నారైలకు వీల్లేదు. 


3. ఓనర్‌షిప్, స్థిరాస్తుల బదలాయింపు: ఎన్నారైలు, పీఐఓలు(పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) స్వదేశంలో ఎలాంటి వాణిజ్య, రెసిడెన్సియల్ ఆస్తులనైనా కొనుగోలు చేయొచ్చు. కానీ, వ్యవసాయ భూములు, ఫామ్‌హౌస్ ల్యాండ్, తోట పెంపకానికి ఉపయోగించే భూములు కొనడానికి వీల్లేదు. అయితే, ఇవి వంశ పార్యపరంగా వస్తే ఎన్నారైలు తీసుకోవచ్చు.    

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.