Mahzooz draw: దుబాయ్‌లో ముగ్గురు భారతీయుల పంట పండింది

ABN , First Publish Date - 2022-05-07T17:46:17+05:30 IST

తాజాగా నిర్వహించిన మహజూజ్ వీక్లీ లక్కీ డ్రాలో ముగ్గురు భారతీయుల పంట పండింది. ఒకరు ఖరీదైన న్యూ బ్రాండ్ SUV వాహనం గెలుచుకోగా, మరో ఇద్దరు చెరో లక్ష దిర్హమ్స్(రూ.20.95లక్షలు) సొంతం చేసుకున్నారు.

Mahzooz draw: దుబాయ్‌లో ముగ్గురు భారతీయుల పంట పండింది

దుబాయ్: తాజాగా నిర్వహించిన మహజూజ్ వీక్లీ లక్కీ డ్రాలో ముగ్గురు భారతీయుల పంట పండింది. ఒకరు ఖరీదైన న్యూ బ్రాండ్ SUV వాహనం గెలుచుకోగా, మరో ఇద్దరు చెరో లక్ష దిర్హమ్స్(రూ.20.95లక్షలు) సొంతం చేసుకున్నారు. ఈద్ సందర్భంగా తాజాగా దుబాయ్‌లో నిర్వహించిన మహజూజ్ వీక్లీ డ్రాలో ఇలా ముగ్గురు భారత ప్రవాసులకు ఒకేసారి అదృష్టం వరించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... షార్జాలో ఉండే భారతీయ వ్యాపారవేత్త ఖలీద్ గత కొన్నేళ్లుగా మహజూజ్ రాఫెల్‌లో పాల్గొంటున్నాడు. దీనిలో భాగంగా ఈద్‌కు కొన్నిరోజుల ముందు అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం. 13166467 ఖలీద్‌కు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. దాంతో అతడు ఖరీదైన SUV వాహనాన్ని గెలిచాడు. ఈ సందర్భంగా ఖలీద్ మాట్లాడుతూ.. "26 ఏళ్లుగా యూఏఈలో ఉంటున్నాను. గత కొన్నేళ్ల నుంచి క్రమం తప్పకుండా మహజూజ్ రాఫెల్‌లో పాల్గొంటున్నా. ఏదో ఒకరోజు తాను పెద్ద బహుమతి గెలుస్తానని నమ్మాను. ఇప్పుడు నా నమ్మకం నిజమైంది. నిస్సాన్ SUV వాహనం గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. తాను లాటరీలో విజేతగా నిలిచినట్లు మొదట నా మేనల్లుడు ఫోన్ చేసి చెప్పడంతో ఎగిరి గంతేసినంత పని చేశాను" అని ఖలీద్ చెప్పుకొచ్చాడు.    


మరో భారత ప్రవాసుడు మహ్మద్(26) కూడా ఇదే డ్రాలో లక్ష దిర్హమ్స్(రూ.20.95లక్షలు) గెలుచుకున్నాడు. దుబాయ్‌లోని డౌన్‌టౌన్‌లో జూస్ మేకర్‌గా పని చేసే మహ్మద్ ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. ఖతార్‌లో ఉండే తన సోదరుడు మొదట తనకు ఈ విషయాన్ని తెలియజేసినట్లు చెప్పాడు. ఏడాది కాలంగా తాను మహజూజ్ రాఫెల్‌లో పాల్గొంటున్నానని, కానీ ఇంత త్వరగా తనకు అదృష్టం కలిసివస్తుందనుకోలేదంటూ మహ్మద్ మురిసిపోయాడు. ఇక తాను గెలిచిన ఈ భారీ మొత్తంలో కొంత భాగాన్ని సొంతూరిలోని తన ఇంటిని బాగు చేయించడానికి వినియోగించనున్నట్లు తెలిపాడు. మహ్మద్‌తో పాటు ఒమన్‌లో ఉండే మరో భారత వ్యక్తి అనీష్(33) కూడా ఇదే వీక్లీ డ్రాలో సేమ్ ప్రైజ్‌మనీ(రూ.20.95లక్షలు) గెలుచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మహజూజ్ డ్రాలో పాల్గొంటున్నాడు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే అతడు ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం విశేషం.   

Read more