వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2021-08-03T05:45:34+05:30 IST

జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యా యి.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
నరసన్నపేట సమీపంలో ట్రాక్కును ఢీకొన్న కారు:

 ఐదుగురికి తీవ్ర గాయాలు

నరసన్నపేట/వజ్రపుకొత్తూరు/ లా వేరు/పాలకొండ: జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యా యి. ఆ వివరాలను పరిశీలిస్తే.. నరసన్నపేట సమీపంలో సోమవారం రోడ్డుపై ఆగిఉన్న ఓ ట్రక్కును కారు ఢీకొంది. ఈ ఘటనలో వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లికి చెందిన బమ్మిడి మోహనరావు అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. మోహనరావు, ఆయన భార్య స్రవంతి, కుమారుడు భరత్‌, బంధువు గొల్లపల్లి అశోక్‌ ఆయన భార్య కౌసల్యలు సోమవారం సాయంత్రం శ్రీకాకుళం నుంచి నగరంపల్లికి కారులో బయలు దేరారు. నరసన్నపేట మండలం దేవాది వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న ట్రక్కును వీరు కారు ఢీకొంది. ఈ ఘటనలో  మోహనరావు అక్కడికక్కడే మృతిచెం దాడు. మిగిలిన నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరంతా శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ఉపాధికోసం దుబాయి వెళ్లిన మోహన రావు ఇటీవలే గ్రామానికి వచ్చినట్లు  సర్పంచ్‌ డి.మధుకేశవరావు తెలిపారు.

 కారు ఢీకొని కూలీ..

లావేరు మండలం అదపాక వద్ద జాతీయ రహదారిపై సోమవారం రాత్రి కారు ఢీకొని దేశపాలెం గ్రామానికి చెందిన యలగాడ అసిరయ్య(55) దుర్మరణం చెందా డు. అసిరయ్యతో పాటు మురపాక దాలయ్యలు అదపాక జంక్షన్‌ సమీ పంలోని ఓ సైట్‌లో కూలి పనికి వెళ్లి తిరిగి వస్తుండగా.. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో అసిరయ్య  అక్కడిక క్కడే మృతి చెందగా.. దాలయ్య తీవ్రంగా గాయపడ్డాడు. దాలయ్యను 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. లావేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 ఆర్టీసీ కార్మికుడు..

పాలకొండ ఆర్డీసీ డిపోగ్యారేజ్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్న కొచ్చరాల జోగారావు (44) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. జోగారావుది ఆమ దాలవలస మండలం కొర్లకోట. టైర్లను పరిశీలించేందుకు జోగారావు బస్సు కిందకు వెళ్లాడు. ఇంతలో డ్రైవర్‌ బస్సును స్టార్ట్‌ చేయడంతో జోగారావు తలపై నుంచి చక్రాలు వెళ్లిపోయాయి. దీంతో ఆయన అక్క డకక్కడే మృతి చెందాడు. దీనిపై ఎస్‌ఐ ప్రసాద్‌ కేసు నమోదు చేశారు. జోగారావుకు భార్య రోహిణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 


 

 

Updated Date - 2021-08-03T05:45:34+05:30 IST