Viral video: మూడు నాగుపాములు కలిసిన వేళ...నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

ABN , First Publish Date - 2021-12-21T14:07:51+05:30 IST

అరణ్యంలో మూడు నాగుపాములు ఒక చోట చేరిన సమయంలో ఓ నెటిజన్ ఈ అరుదైన దృశ్యాన్ని వీడియో తీశారు....

Viral video: మూడు నాగుపాములు కలిసిన వేళ...నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

అరణ్యంలో మూడు నాగుపాములు ఒక చోట చేరిన సమయంలో ఓ నెటిజన్ ఈ అరుదైన దృశ్యాన్ని వీడియో తీశారు. పొడవైన మూడు నాగుపాములు మెరుస్తూ తోకపై నిలబడిన అద్భుత దృశ్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఒక చోట సమావేశమైనట్లు నిలబడిన మూడు నాగుపాములను వీడియో తీసి హెలికాప్టర్ యాత్ర అనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మూడు నాగుపాములు కలిసిన అరుదైన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి దీనికి ఫన్నీ క్యాప్షన్ ఇవ్వమని నెటిజన్లను కోరారు. దీంతో మూడు నాగుపాముల కలయికను ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. 





ఇదీ పాముల రౌండ్ టేబుల్ సదస్సు అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.రెండు పాములు దగ్గరగా ఉండగా మూడో పాము దూరం నుంచి విజేతను నిర్ణయించేందుకు రిఫరీగా వ్యవహరిస్తుందని మరో నెటిజన్ చెప్పారు. నాగుపాములు ఆగ్నేయ ఆసియా అరణ్యాల్లో ఎక్కువగా ఉంటాయి. 3 నుంచి 4 మీటర్ల పొడవు ఉన్న నాగుపాములు అత్యంత విషపూరితమైనవి.

Updated Date - 2021-12-21T14:07:51+05:30 IST