మూడు నెలల ముచ్చట

ABN , First Publish Date - 2021-11-18T05:49:57+05:30 IST

మూడు నెలల క్రితం ఆత్మకూరులో ఏర్పాటు చేసిన రైతు బజారుకు ఆదరణ కరువైంది.

మూడు నెలల ముచ్చట
ఆత్మకూరులో మూతబడిన రైతు బజారు

  1. రైతు బజారుకు ఆదరణ కరువు 
  2. ప్రజలకు, రైతులకు అవగాహన ఏదీ..?
  3. నిర్వహణను గాలికొదిలేసిన అధికారులు 
  4. మూతబడిన దుకాణాలు.. రూ.65 లక్షలు వృథా


ఆత్మకూరు, నవంబరు 17: మూడు నెలల క్రితం ఆత్మకూరులో ఏర్పాటు చేసిన రైతు బజారుకు ఆదరణ కరువైంది. దీంతో మూసివే యాల్సిన దుస్థితి నెలకొంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతు ప్రయోజాలను దృష్టిలో ఉంచుకుని రైతుబజారు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దీనివల్ల రైతులకు లాభం చేకూరుతుందని, వినియోగదారులకు తక్కువ ధరకు కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు వంటివి లభిస్తాయని ప్రభుత్వం భావించింది. రూ.65 లక్షల నిధులతో ఆత్మకూరు మార్కెట్‌ యార్డు ఆవరణలో 38 స్టాల్స్‌తో రైతు బజారును నిర్మించారు. ఈ ఏడాది జూలై 8న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఈ రైతు బజారును ప్రారంభించారు. మొదట నాలుగైదు కూరగాయల దుకాణాలను ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి ఆదరణ లేకపోవడంతో వాటిని తొలగించారు. ఆత్మకూరు డివిజన్‌ పరిధిలో కూరగాయలు సాగుచేసే రైతులు దినసరి సంతకు వెళ్లి అమ్ముకుంటారు. దీంతో రైతు బజారుకు వచ్చే నాథులే లేరు. రైతుబజారు నిర్వహణను గాలికి వదిలేశారు. దీంతో ప్రాంగణమంతా పిచ్చిమొక్కల తో నిండిపోయింది. మార్కెటింగ్‌ శాఖ అధికా రులు వినియోగదారులకు, రైతులకు రైతు బజా రు గురించి అవగాహన కల్పించలేదని, అందుకే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వస్తున్నాయి. 


ఆసక్తి చూపడం లేదు..

ఆత్మకూరు రైతుబజారులో కూరగాయలు, ఇతర నిత్యావసరాలను విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. కూరగాయలకు మంచి గిరాకీ ఉండటంతో రైతుబజారులో కన్నా బహిరంగ మార్కెట్‌లో అమ్మితేనే అధిక లాభాలు వస్తాయని రైతులు భావిస్తున్నారు. రైతు బజారులో ఓపెన్‌ స్టాల్స్‌ ఉన్నాయి. రాత్రిళ్లు నిల్వ చేయడం సమస్యగా మారుతోంది. దీంతో వ్యాపారులు ముందుకు రావడం లేదు. కూరగాయలు, పండ్లు, పూలు, పాలు, వ్యవసాయ దిగుబడులను రైతు బజారులో అమ్మేందుకు ఉన్నతాధికారులు అవకాశం ఇచ్చారు. రైతులకు, వినియోగదారులకు రైతుబజారు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తా   

     

  - మహేశ్వరి, రైతు బజారు ఇన్‌చార్జి

Updated Date - 2021-11-18T05:49:57+05:30 IST