గూగుల్‌ అసిస్టెంట్‌కు మరో మూడు ఫీచర్లు

ABN , First Publish Date - 2021-05-01T05:30:00+05:30 IST

ఇంటర్నెట్‌ సెర్చ్‌ జెయింట్‌ గూగుల్‌ తన ‘గూగుల్‌ అసిస్టెంట్‌’కు మరో మూడు కొత్త ఫీచర్లను కలుపుతోంది. వాయిస్‌ బేస్డ్‌ అసిస్టెంట్‌గా ఇది వ్యక్తుల పేర్లే కాదు, అందులో కచ్చితత్వం,

గూగుల్‌ అసిస్టెంట్‌కు మరో మూడు ఫీచర్లు

ఇంటర్నెట్‌ సెర్చ్‌ జెయింట్‌ గూగుల్‌ తన ‘గూగుల్‌ అసిస్టెంట్‌’కు మరో మూడు కొత్త ఫీచర్లను కలుపుతోంది. వాయిస్‌ బేస్డ్‌ అసిస్టెంట్‌గా ఇది వ్యక్తుల పేర్లే కాదు, అందులో కచ్చితత్వం, కాంటెక్స్ట్‌ పరంగా సంభాషణను సైతం గుర్తుపడుతుంది. వినియోగదారుడి కాంటాక్ట్స్‌లోని పేరును గూగుల్‌ అసిస్టెంట్‌ పలుకగలుగుతుంది. రికార్డు చేయనప్పటికీ మీ ఉచ్ఛారణను గుర్తుపట్టగలుగుతుంది.  మీరు పలుకుతున్నప్పడే వాటిని గుర్తుంచుకుంటుందని ఒక బ్లాగ్‌పోస్ట్‌లో గూగుల్‌ వివరించింది. ప్రస్తుతం ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చే ఈ సదుపాయాన్ని మున్ముందు ఇతర భాషలకూ విస్తరించనున్నారు.


అదేవిధంగా కాంటెక్ట్స్‌(సందర్భాన్ని)ని కచ్చితంగా అర్థం చేసుకుంటుంది. నేచురల్‌ లాంగ్వేజ్‌ అండర్‌ స్టాండింగ్‌(ఎన్‌ఎల్‌యూ) మోడల్స్‌తో గూగుల్‌ అసిస్టెంట్‌ను పునర్నిర్మిస్తోంది. మూడోది, గూగుల్‌ అసిస్టెంట్‌తో సహజ సంభాషణకు వీలు కలిగిస్తున్నారు. అంటే ఒక ప్రదేశం చెప్పి, మరింత సమాచారం కోరినపక్షంలో పూర్తిగా అర్థం చేసుకుంటుంది. పదేపదే అదే ప్రదేశాన్ని పునరుచ్ఛరించాల్సిన అవసరం మాత్రం ఉండబోదు.

Updated Date - 2021-05-01T05:30:00+05:30 IST