UP: తాజ్‌మహల్‌లో ముస్లిం టూరిస్టుల నమాజ్...ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

ABN , First Publish Date - 2022-08-12T21:16:07+05:30 IST

భారతదేశంలో టూరిస్టులను విపరీతంగా ఆకర్షించే పర్యటక కేంద్రంగా తాజ్‌మహల్‌కు ప్రత్యేక గుర్తింపు ..

UP: తాజ్‌మహల్‌లో ముస్లిం టూరిస్టుల నమాజ్...ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

ఆగ్రా: భారతదేశంలో టూరిస్టులను విపరీతంగా ఆకర్షించే పర్యటక కేంద్రంగా తాజ్‌మహల్ (Taj Mahal)కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆగ్రాలోని ఈ అపురూప కట్టడం చూడటానికి వచ్చిన కేరళ ముస్లిం టూరిస్టులు (Muslim Tourists)  ముగ్గురు చిక్కుల్లో పడ్డారు. తాజ్‌మహల్‌ ఆవరణలోని గార్డెన్‌లో నమాజ్ (Namaz) చేస్తూ ఉత్తరప్రదేశ్ పోలీసులకు పట్టుబడ్డారు. ఆలస్యంగా ఈ వ్యవహారం వెలుగుచూసింది.


కేరళకు చెందిన అనస్, మన్సూరి, అవసద్ అనే పర్యాటకులు తాజ్‌మహల్ సందర్శించడానికి వచ్చారు. ఈ క్రమంలోనే తాజ్ ఆవరణలో నమాజ్‌‌కు ఉపక్రమించారు. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కు చెందిన ఉద్యోగి కంటపడింది. దీంతో ఆయన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లాడు. వెంటనే స్పందించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ముగ్గురు టూరిస్టులను అదుపులోనికి తీసుకుని సుమారు గంటసేపు ప్రశ్నించారు. తమకు ఇక్కడి నిబంధనలు తెలియవని, పొరపాటు జరిగిందని ఆ ముగ్గురు ఒప్పుకున్నారు. లిఖితపూర్వక క్షమాపణను అధికారులకు సమర్పించారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పొరపాట్లు చేయవద్దని హెచ్చరించిన అధికారులు వారిని విడిచిపెట్టారు. తాజ్‌మహల్ ఆవరణలో స్థానికులు మాత్రమే శుక్రవారం ప్రార్థనలు చేస్తుంటారు. అదికూడా, అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే నమాజ్ చేస్తుంటారు.

Updated Date - 2022-08-12T21:16:07+05:30 IST