అమెరికాలో ఒకేరోజు మూడు చోట్ల కాల్పులు.. నలుగురు మృతి!

May 9 2021 @ 10:32AM

న్యూయార్క్, మేరీల్యాండ్, సౌత్​ ఫ్లోరిడా: అగ్రరాజ్యం అమెరికాలో శనివారం ఒకే రోజు మూడు చోట్ల కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ మూడు ఘటనల్లో నలుగురు చనిపోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మొదటి ఘటన అమెరికాలోని మేరీల్యాండ్​లో జరిగింది. గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. అయితే, కాల్పులు జరిపిన అనుమానితుడిని మేరీల్యాండ్ పోలీసులు అక్కడిక్కడే కాల్చి చంపేసినట్లు సమాచారం. రెండో ఘటన అమెరికాలోని సౌత్​ ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ మాల్​లో రెండు గ్రూపుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ కాస్తా కాల్పులకు దారి తీసింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఇక మూడో ఘటన న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో జరిగింది. టైమ్స్ స్క్వేర్‌ వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ కాల్పుల్లో నాలుగేళ్ల చిన్నారితో పాటు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, న్యూయార్క్​లో వరుస కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఎన్​వైపీడీ కమిషనర్ డెర్మోట్ సియా పేర్కొన్నారు.

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.