ముగ్గురు దొంగలు అరెస్టు

ABN , First Publish Date - 2022-06-28T05:30:00+05:30 IST

ప్రయాణికుల బ్యాగులు దొంగిలించే ముఠా ఆట కట్టించారు పోలీసులు. ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.7.5 లక్షల సొత్తును స్వాఽధీనం చేసుకున్నారు.

ముగ్గురు దొంగలు అరెస్టు
మాట్లాడుతున్న డీఎస్పీ నాగరాజు

రూ.7.5 లక్షల సొత్తు స్వాధీనం

డీఎస్పీ నాగరాజు వెల్లడి

ఒంగోలు(క్రైం), జూన్‌ 28: ప్రయాణికుల బ్యాగులు దొంగిలించే ముఠా ఆట కట్టించారు పోలీసులు. ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.7.5 లక్షల సొత్తును స్వాఽధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఒంగోలు డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలను డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం కట్టా జ్వోతి, తాడిపర్తి రవి, ప్రకాశం జిల్లా కొం డపి మండలం కట్టా రమేష్‌ తొమ్మిది కేసుల్లో నిందితులని తెలిపారు. వీరిపై కొత్తపట్నం, ఒంగోలు, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, తెలంగాణ రాష్ట్రంలో గజ్వేలు పోలీ్‌సస్టేషన్‌లలో కేసులు ఉన్నాయని చెప్పారు. ముగ్గురు నిందితులను కొత్తపట్నం సమీపంలోని నల్లవాగు వద్ద ఉండగా కొత్తపట్నం ఎస్సై తన సిబ్బందితో అరెస్టు చేశారని వెల్లడించారు. వారి వద్ద 15 సవర్ల బంగారం, రూ.45వేల నగదు, మూడు మోటర్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన ఒంగోలు టౌన్‌ సీఐ రాఘవరావు, ఎస్సై లు నాగేశ్వరరావు, కె.మధుసూదనరావు, ఏఎస్సై బాలాంజనేయులు, హెడ్‌ కానిస్టేబుళ్లు అంకమరావు, కానిస్టేబుళ్లు అంజిబాబు, చాంద్‌బాషాలను డీఎస్పీ అభినందించారు.

Updated Date - 2022-06-28T05:30:00+05:30 IST