ఇండియన్ కాన్సులేట్‌లో ఘనంగా Rabindranath Tagore జయంతి.. అరబిక్‌లోకి అనువాదమైన 3 ఐకానిక్ పాటలు విడుదల

ABN , First Publish Date - 2022-05-10T15:07:13+05:30 IST

దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్‌‌లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 161 జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఇండియన్ కాన్సులేట్‌లో ఘనంగా Rabindranath Tagore జయంతి.. అరబిక్‌లోకి అనువాదమైన 3 ఐకానిక్ పాటలు విడుదల

దుబాయి: దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్‌‌లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 161 జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాసిన మూడు పాటలను(అరబిక్‌లోకి అనువాదమైన) విడుదల చేశారు. దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియంలో ‘ఠాగూర్ బియాండ్ హారిజోన్’ పేరిట జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ 3 ఐకానిక్ పాటలను కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా అమన్ పూరి విడుదల చేశారు. 'ఏక్లా చలోరే', 'అలోకేర్ ఈ', 'నై నై భాయ్' అనే మూడు పాటలను బెంగాలీ భాష నుంచి ప్రఖ్యాత ఎమిరాటి కవి డా. షిహాబ్ ఘనేమ్ అరబిక్‌లోకి అనువదించడం జరిగింది. ఈ పాటలకు దేవ్ చక్రవర్తి స్వరాలు అందించగా.. 130 భాషల్లో పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకెక్కిన 16 ఏళ్ల సుచేత సతీష్ ఆలపించారు. కాగా, ఠాగూర్ రాసిన మూడు పాటలు అరబిక్‌లోకి అనువదించడం ఇదే తొలిసారి. సుచేత, దేవ్ చక్రవర్తి కలిసి బెంగాలీ నుంచి అరబిక్‌లోకి అనువదించిన పాటలను పాడి వినిపించారు. కార్యక్రమంలో ఇండియన్ పీపుల్స్ ఫోరం సభ్యులు ప్రదీప్ మురళీ, శివ కుమార్, సుమీత, కుంభాల మహేందర్ రెడ్డి, ఇండియన్ కాన్సులేట్‌ అధికారులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-10T15:07:13+05:30 IST

Read more