ltrScrptTheme3

ఒకేరోజు మూడు ట్రైలర్లు

Oct 26 2021 @ 05:01AM

బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ నుంచి సోమవారం ఒక్కరోజే మూడు చిత్రాల ట్రైలర్లు విడుదలయ్యాయి. సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అంతిమ్‌’. ఆయుష్‌ శర్మ కథానాయకుడు. సోమవారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. గ్యాంగ్‌స్టర్స్‌కు పోలీసులకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో కథ సాగుతుంది. నవంబరు 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 


బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘సత్యమేవ జయతే 2’. నవంబర్‌ 25న విడుదలవుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. మిలాప్‌ జవేరి దర్శకుడు. రాజకీయనాయకుడు, పోలీసాఫీసర్‌, విలన్‌... మూడు పాత్రల్లో ట్రైలర్‌లో కనిపించి జాన్‌ అబ్రహం ఆకట్టుకున్నారు. 


సిద్ధాంత్‌ చతుర్వేది, రాణీ ముఖర్జీ, సైఫ్‌ అలీఖాన్‌, శార్వరీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’. 2005లో వచ్చిన ‘బంటీ ఔర్‌ బబ్లీ’ కి ఇది సీక్వెల్‌. సోమవారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. మధ్య తరగతి కుటుంబాల జీవితాల నేపథ్యంలో దర్శకుడు వరుణ్‌ శర్మ వినోదాత్మకంగా తెరకెక్కించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.