మూడేళ్లకు వచ్చావు.. సమస్యల సంగతేంది?

ABN , First Publish Date - 2022-05-26T05:54:27+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడే ళ్లు కావస్తున్నా గ్రామాల్లో సమస్యల పరిష్కారం పట్టించుకోకుండా ఇప్పుడు గ్రామానికి తిరిగి వచ్చావంటూ గ్రామస్థులు.. పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌నారాయణను నిలదీశారు.

మూడేళ్లకు వచ్చావు.. సమస్యల సంగతేంది?
ఎమ్మెల్యే శంకర్‌నారాయణను నిలదీస్తున్న చెర్లోపల్లి వాసులు

పెనుకొండ ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు


పరిగి, మే 25: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడే ళ్లు కావస్తున్నా గ్రామాల్లో సమస్యల పరిష్కారం పట్టించుకోకుండా ఇప్పుడు గ్రామానికి తిరిగి వచ్చావంటూ గ్రామస్థులు.. పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌నారాయణను నిలదీశారు. మండలంలలోని చెర్లోపల్లిలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  ఎమ్మెల్యే, అధికారులు, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కా ర్యక్రమం ప్రారంభంలోనే గ్రామంలో తాగునీరు, మురుగు కాలువ లు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించ లేదనీ, పింఛన్లు, రేషనకార్డులు తొలగించారనీ, విద్యుత బిల్లులు అధికంగా వచ్చాయని ఎమ్మెల్యేను గ్రామస్థులు నిలదీశారు. మూడేళ్లుగా మా గ్రామానికి వచ్చి ఏ నాయకుడూ సదుపాయాలను పట్టించుకోలేదని వాపో యారు. పోలీసులు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా సదుపాయాల కల్పనలో హామీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. పలువు రు మహిళలు.. తమకు ఇప్పటి వరకు అమ్మఒడి పథకం మం జూరు కాలేదని ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. మోదా పంచాయతీ పరిధిలోని మూడు గ్రామాల్లో కార్యక్రమంలో నిర్వహించాల్సి ఉండగా.. రెండు గ్రామాలతోనే సరిపెట్టారు.


హిందూపురం టౌన: పట్టణంలోని మూడో వార్డులో ఎంపీ గో రంట్ల మాధవ్‌ను బుధవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానికులు నిలదీశారు. ప్రభుత్వ పథకా లు తమకు అందడం లేదని మహిళలు ప్రశ్నించారు. రజకులకు సంబంధించి రూ.10 వేలు ప్రభుత్వం ఇస్తోందన్నారు.అయితే ఈ సారి తనకు ఇవ్వలేదని ఓ రజక మహిళ అడిగింది. ఇందుకు ఎం పీ స్పందిస్తూ, జూన నుంచి వస్తుందని సమాధానం ఇచ్చారు. అ దేవిధంగా తనకు చిల్లరకొట్టు ఉందని, రూ.పది వేలు ఇస్తామని చె ప్పారే తప్పా, ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదని ఓ వృద్ధురాలు ప్రశ్నించింది. మరో మహిళ తనకు ఇల్లు లేదని, ఇప్పటివరకు స్థ లం కూడా చూపించలేదని వాపోయింది. 


Updated Date - 2022-05-26T05:54:27+05:30 IST