అత్యాచారయత్నం కేసులో మూడేళ్ల జైలు

ABN , First Publish Date - 2022-09-24T06:23:54+05:30 IST

బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తికి చిత్తూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి మూడేళ్లు జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించారు.

అత్యాచారయత్నం కేసులో మూడేళ్ల జైలు

చిత్తూరు లీగల్‌, సెప్టెంబరు 23 : బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తికి చిత్తూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి మూడేళ్లు జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించారు. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన ఓ మహిళా కూలీ తన పిల్లలతో కలిసి ఇంటి ముందు నిద్రిస్తుండగా శ్రీనివాసులు అనే వ్యక్తి ఆమె పెద్ద కుమార్తె(15)పై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో మేలుకున్న చుట్టుపక్కల జనం అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోక్సో చట్టం కింద  కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండుకు తరలించారు. శుక్రవారం చిత్తూరులోని పోక్సో కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. నేరం రుజువు కావడంతో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.


Updated Date - 2022-09-24T06:23:54+05:30 IST