
నవీన్ చంద్ర, చాందిని చౌదరి జంటగా నటించిన థ్రిల్లర్ చిత్రం ‘సూపర్ ఓవర్’. దివంగత దర్శకుడు ప్రవీణ్ వర్మ తెరకెక్కించారు. సుధీర్ వర్మ నిర్మాత. శుక్రవారం ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకురానుందీ సినిమా. సుధీర్ వర్మ మాట్లాడుతూ ‘‘దర్శకుడు కావాలని ప్రవీణ్ వర్మ పరిశ్రమకు వచ్చాడు. ‘సూపర్ ఓవర్’ సినిమా పూర్తి చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతని ప్రయత్నం సక్సెస్ అవుతుంది’’ అని అన్నారు. నవీన్ చంద్ర మాట్లాడుతూ ‘‘థ్రిల్లర్ కథాంశంతో ఆద్యంతం ఉత్కంఠగా సాగే చిత్రమిది’’ అన్నారు. క్రికెట్ బెట్టింగ్‌పై డీటెయిల్డ్‌గా తీసిన చిత్రమిదని చాందిని చెప్పారు