బడుగుల ఇళ్లపై పిడుగు

ABN , First Publish Date - 2021-10-24T07:01:58+05:30 IST

ప్రభుత్వం బడుగుల నెత్తిన పిడుగువేస్తోంది. గతంలో ఎప్పుడో ప్రభుత్వ రుణంతో పక్కాగృహాలు నిర్మించుకున్న లబ్ధిదారుల నుంచి ఇప్పుడు ఆ మొత్తాలను ముక్కుపిండి వసూలు చేయబోతోంది.

బడుగుల ఇళ్లపై పిడుగు
ఒంగోలు ఇందిరమ్మ కాలనీలోని గృహాలు

వన్‌టైం పేరుతో వసూళ్లు

పక్కా గృహాల లబ్ధిదారులపై రిజిస్ట్రేషన్‌ మోత

ఒక్కొక్కరి వద్ద  రూ.10వేల నుంచి  

రూ.40 వేల వరకూ గుంజేందుకు పన్నాగం

ఖజానా నింపుకొనేందుకు ప్రభుత్వం ఎత్తుగడ

పేదలకు భారంగా మారిన జగనన్న గృహహక్కు

బడుగుల నెత్తిన మరో బండ. ప్రభుత్వం తియ్యగా మాటలు చెబుతూ పేదలను నిలువుదోపిడీ చేస్తోంది. ఒక్క రూపాయికే మీ ఇల్లు, మీ స్థలం మీకు రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తాం అని చెప్తూ వారి నుంచి వేల రూపాయల వసూలుకు ఎత్తుగడ వేసింది. ఇప్పటి వరకు పక్కా గృహ నిర్మాణం కోసం మీరు తీసుకున్న మొత్తం (రుణం) వన్‌టైం సెటిల్‌మెంటు చేసుకుని రూ.10వేల నుంచి రూ.40వేల వరకు ప్రభుత్వానికి చెల్లించిన వారికి రూ.1కే రిజిస్ట్రేషన్‌ చేస్తామంటూ  మెలిక పెట్టింది. ఇలా జిల్లాలోని 3 లక్షల మంది పేదల నుంచి రూ.కోట్లు లాక్కుని ఖజానాను నింపుకోవాలని చూస్తోంది.  దానికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అనే చక్కని పేరు పెట్టింది. కాగా ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చింది సాయమని నమ్మిన జనం ఇప్పుడు అది రుణమని చెబుతుండటంతో ఇంత మోసమా అంటూ ఆశ్చర్యపోతున్నారు.


ఒంగోలు నగరం, అక్టోబర్‌ 23: ప్రభుత్వం బడుగుల నెత్తిన పిడుగువేస్తోంది. గతంలో ఎప్పుడో ప్రభుత్వ రుణంతో పక్కాగృహాలు నిర్మించుకున్న లబ్ధిదారుల నుంచి ఇప్పుడు ఆ మొత్తాలను ముక్కుపిండి వసూలు చేయబోతోంది. వన్‌టైం సెటిల్‌మెంటు పేరుతో పేదల నుంచి వేలు దండుకునే పథకానికి తెరలేపింది. ఇందుకోసం ఇప్పటికే సర్వేను ప్రారంభించింది. గ్రామాల్లో ఇప్పటి వరకూ  ఎవరు ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌ గృహకల్ప తదితర పథకాల కింద పక్కాగృహాలు నిర్మించుకున్నారు. వారు బతికే ఉన్నారా.. లేక ఆ ఇంటిలో వారి వారసులు ఉంటున్నారా? లేదా ఎవరికైనా విక్రయించారా.. అనే వివరాలను వలంటీర్లు సేకరిస్తున్నారు. ఈ సర్వేను ఈనెల 25లోపు పూర్తిచేసి అక్కడ నుంచి లబ్ధిదారుల వద్ద రూ.10 వేల నుంచి రూ.40 వేల దాకా వసూలు చేయనున్నారు. ఈ వసూలు ప్రక్రియను డిసెంబర్‌ 25వ తేదీ వరకు ప్రభుత్వం కొనసాగించనుంది. 


ఇప్పుడు ఆ రుణాలు వసూలా?

రాష్ట్రంలో 30 ఏళ్లుగా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పేదలు పక్కా గృహాలు నిర్మించుకుంటున్నారు. 2014 మార్చి వరకు ప్రభుత్వాలు పేదలకు కొంత సబ్సిడీతో గృహాలు నిర్మించుకునేందుకు రుణాలు అందజేశాయి. అయితే గూడు కట్టుకున్నది పేదలే కాబట్టి ఇచ్చిన రుణాలను ఏప్రభుత్వం తిరిగి కట్టించుకోలేదు. పైగా ఇప్పటివరకు లబ్ధిదారులను తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించమన్న వారే లేరు. దీంతో పక్కాగృహాలు పొందిన లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం ఉచితమే అని ఇంతకాలం అనుకున్నారు. గతంలో సంక్షేమం పేరుతో పేదలకు జిల్లాలో ఈ 30ఏళ్లలో లక్షలాది గృహాలు నిర్మించి ఇచ్చారు. అంతా సాయమనే చెబుతూ వచ్చారు. ప్రస్తుత  వైసీపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఇప్పటివరకూ రుణాలు తిరిగి చెల్లించని వారు వన్‌టైం సెటిల్‌మెంటు ద్వారా చెల్లించాలని జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం పేరుతో లబ్ధిదారుల నుంచి వసూలుకు సిద్ధమైంది. 


గృహ నిర్మాణాల అమలు తీరు ఇదీ..

రాష్ట్రంలో 1983 నుంచి ప్రభుత్వ సాయంతో గృహాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వా రాష్ట్రంలో 30 ఏళ్లుగా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పేదలు పక్కా గృహాలు నిర్మించుకుంటున్నారు. 2014 మార్చి వరకు ప్రభుత్వాలు పేదలకు కొంత సబ్సిడీతో గృహాలు నిర్మించుకునేందుకు రా వీటిని నిర్మించేవారు. తొలుత పక్కాగృహాలకు యూనిట్‌ ధర రూ.6వేలుగా ఉండేది. అప్పట్లో పెంకుటిళ్లను నిర్మించి ఇచ్చేవారు. 1988లో ఇంటి యూనిట్‌ విలువను రూ.8వేలకు పెంచారు. 1989 నుంచి 1994 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కూడా రూ.8వేలనే యూనిట్‌ విలువగా కొనసాగించారు. 1994లో ఎన్టీఆర్‌ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిట్‌ విలువను రూ.12వేలకు పెంచారు. చంద్రబాబునాయుడు సీఎం అయ్యాక 1998లో ఈ విలువ రూ.17,500కు పెరిగింది. 2004లో వైఎస్‌ సీఎంగా పగ్గాలు చేపట్టి ఇందిరమ్మ పేరుతో లక్షలాది గృహాలను నిర్మించారు. నాటి ధరలకు అనుగుణంగా ఒక్కో ఇంటికి రూ.28,500 ఇచ్చారు. రాజీవ్‌ గృహకల్ప పేరుతో పట్టణాల్లో నిర్మించే గృహాలకు రూ.90వేలు ఇచ్చారు. అయితే ఈ పథకంలో కొంత సబ్సిడీ, ప్రభుత్వ రుణంతోపాటు బ్యాంకుల నుంచి కూడా కొంత రుణం అందజేశారు. 2011లో ఇందిరమ్మ ఇంటి యూనిట్‌ ధరను రూ.40వేలకు పెంచారు. అదే విలువ 2014లో జరిగిన రాష్ట్ర విభజన వరకు కొనసాగింది. విభజన తర్వాత ప్రభుత్వాలు ఇస్తున్న యూనిట్‌ విలువ మొత్తం ఉచితంగానే అందజేస్తున్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక యూనిట్‌ విలువను రూ.1.50లక్షలకు పెంచి ఈ పథకాన్ని అమలు చేశారు.


వన్‌టైం సెటిల్‌మెంటు కేటగిరీలుగా విభజన

 పక్కాగృహాలు పొందిన వారిలో 90శాతం మంది తిరిగి రుణాలను ప్రభుత్వానికి చెల్లించలేదు.  ప్రస్తుతం వన్‌టైం సెటిల్‌మెంటు ద్వారా సెటిల్‌ చేసు కుంటే రూ.1కే రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామంటూ ప్రభుత్వం చె బుతోంది.  లబ్ధిదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని గ్రామీణ, పట్ట ణ, నగరాల పరిధిలో ఒక్కో విధంగా నిర్ణయించారు. అప్పట్లో ఇంటి ని నిర్మించుకుని అతను, లేదా అతని వారుసులే ఆ ఇంటిలో నివాసం ఉంటుంటే గ్రామీణ ప్రాంతాల్లో  రూ.10 వేలు, పట్టణప్రాంతాల్లో రూ.15వేలు, నగ రాల్లో రూ.20వేలు వన్‌టైం సెటిల్‌మెంటు కింద చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ లబ్ధిదారుడు ఆ ఇంటిని ఇతరులకు అమ్మేసి అందులో కొనుగో లుదారుడు నివాసం ఉంటుంటే వారు గ్రామాల్లో అయితే రూ.20వేలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.30వేలు, నగరాల్లో  రూ.40 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వన్‌టైం సెటిల్‌మెంటు ద్వారా డబ్బు చెల్లిస్తే వారికి రిజిస్ట్రేషన్‌ చేసి హక్కు పత్రాలను అందజేస్తారు. 


జిల్లాలో 3.80లక్షల మంది లబ్ధిదారులు

రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన రుణం ద్వారా జిల్లాలో 1983 నుంచి పక్కాగృహాలను నిర్మిం చుకున్న 3.80లక్షల మంది ఉన్నట్లు హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు వారి వద్ద ఉన్న రికార్డుల ప్రకారం గుర్తించారు. వివరాలను గ్రామస్థాయి సచివాలయాలకు అందజే శారు. ఇళ్లకు వెళ్లి లబ్ధిదారుడే ఆ ఇంటిలో నివాసం ఉంటున్నారా లేక వారి వారసులు ఉంటున్నారా లేక అమ్ముకోగా కొనుగోలుదారుడు ఆ ఇంటిలో నివాసం ఉంటున్నారా అనే వివరాలను సేకరిస్తున్నారు. ఈనెల 25 వరకు ఈ సర్వే కొనసాగనుంది. 






Updated Date - 2021-10-24T07:01:58+05:30 IST