పశువులకాపరులపై పిడుగులు

ABN , First Publish Date - 2021-04-23T05:28:10+05:30 IST

మండలంలోని రెండు గ్రామాల్లో పిడుగులు పడి ఇద్దరు పశువుల కాపరులు మృతిచెందారు. చౌటపాలెం గ్రామానికి చెందిన కొండూరి రమణయ్య(50), విప్పగుంట గ్రామంలో చుంచు రామయ్య(49) పశువులు మేపుతుంటుండగా గురువారం మధ్యాహ్నం అకాల వర్షంతోపాటు పిడుగులు పడి అక్కడికక్కడే ఇరువురు మృతిచెందారు.

పశువులకాపరులపై పిడుగులు
విప్పగుంటకు చెందిన చుంచు రామయ్య (49)

వేర్వేరు చోట్ల ఇద్దరు మృతి, ఒకరు క్షేమం 

పొన్నలూరు, ఏప్రిల్‌ 22: మండలంలోని రెండు గ్రామాల్లో పిడుగులు పడి ఇద్దరు పశువుల కాపరులు మృతిచెందారు. చౌటపాలెం గ్రామానికి చెందిన కొండూరి రమణయ్య(50), విప్పగుంట గ్రామంలో చుంచు రామయ్య(49) పశువులు మేపుతుంటుండగా గురువారం మధ్యాహ్నం అకాల వర్షంతోపాటు పిడుగులు పడి అక్కడికక్కడే ఇరువురు మృతిచెందారు. చౌటపాలెంలో మరణించిన రమణయ్యతోపాటు పక్కనే ఉన్న కొండూరి మాధవ పిడుగుపాటుకు స్పృహ కోల్పోయాడు. తర్వాత  కోలుకున్నాడు. ఈ ఘటనతో రెండు గ్రామాల్లో విషాదచాయలు నెలకొన్నాయి. వర్షానికి తడవకుండా ఇరువురు తమకు సమీపంలోని చెట్ల కిందకు రక్షణ కోసం వెళ్లి నిలుచున్నారు. అయితే ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడటంతో ఇద్దరు మృత్యువాతపడ్డారు. సాయంత్రం 4.30సమయంలో ఇంటికి బయలుదేరాల్సిన సమయంలో ఈ ఘటన జరగడం విషాదాన్ని నింపింది. రమణయ్యకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొడుకు, కూతురు ఇద్దరు చదువుతున్నారు. చుంచు రామయ్యకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. కుమారుడు బీటెక్‌ చదువుతున్నాడు. ఇంటి పెద్దలు మృతిచెందడంతో ఆ కుటుంబాలు దిక్కులేనివయ్యాయి.




Updated Date - 2021-04-23T05:28:10+05:30 IST