Chinaలో టిబెట్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అవుతుండగా ప్రమాదం

ABN , First Publish Date - 2022-05-12T16:18:38+05:30 IST

చైనా దేశంలో టిబెట్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అవుతుండగా ప్రమాదం జరిగింది....

Chinaలో టిబెట్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అవుతుండగా ప్రమాదం

చాంగ్‌కింగ్‌(చైనా): చైనా దేశంలో టిబెట్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అవుతుండగా ప్రమాదం జరిగింది. చైనాలో టిబెట్ ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ ఏ319 టేకాఫ్ అవుతుండగా జరిగిన ప్రమాదంతో మంటలు చెలరేగాయి. విమానం నుంచి ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా కిందకు దించారు. విమానంలో ఉన్న 113 మంది ప్రయాణికులు,9 మంది సిబ్బంది క్షేమంగా బయటపడ్డారని విమానయాన అధికారులు చెప్పారు. వీరిలో కొందరికి  స్వల్ప గాయాలు అయ్యాయని విమానయాన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ విమానం కుప్పకూలిన రెండు నెలల లోపే ఈ సంఘటన జరిగింది. ఎయిర్ చైనా అనుబంధ సంస్థ అయిన టిబెట్ ఎయిర్‌లైన్స్ విమానం నుంచి ప్రయాణికులు, సిబ్బంది దిగుతుండగా విమానం ఎడమ వైపు మంటలు వ్యాపించాయి.




Read more