టిడ్కో ఇళ్లపై కౌన్సిల్‌లో రగడ

ABN , First Publish Date - 2022-07-01T06:38:23+05:30 IST

మండపేట మున్సిపల్‌ సాధారణ సమావేశం అధికార, ప్రతిపక్ష కౌన్సిల్‌ సభ్యుల ప్రశ్నలు, ఆరోప ణలు, ప్రత్యారోపణలు నడుమ వాడిగావేడిగా సాగింది.

టిడ్కో ఇళ్లపై కౌన్సిల్‌లో రగడ

టిడ్కో ఇళ్లపై ప్రశ్నించిన టీడీపీ కౌన్సిలర్‌  

 నోరు అదుపులో పెట్టుకోమని తోట హెచ్చరిక

 వాడివేడిగా మండపేట కౌన్సిల్‌ సమావేశం

మండపేట, జూలై 30: మండపేట మున్సిపల్‌ సాధారణ సమావేశం అధికార, ప్రతిపక్ష కౌన్సిల్‌ సభ్యుల ప్రశ్నలు, ఆరోప ణలు, ప్రత్యారోపణలు నడుమ వాడిగావేడిగా సాగింది. చైర్‌ప ర్సన్‌ పతివాడ నూకదుర్గారాణి అధ్యక్షతన మున్సిపల్‌ సమా వేశం గురువారం జరిగింది. టిడ్కో ఇళ్లకు సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడు  ఎప్పుడు ఇళ్లను ఇస్తారో చెప్పాలని టీడీపీ కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. ఆ విషయం టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇళ్లను ప్రారంభించిన వారినే అడిగితే బాగుం టుందని 30వవార్డు వైసీపీ కౌన్సిలర్‌ పిల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. దీంతో  టీడీపీ కౌన్సిలర్‌ చుండ్రు చినసుబ్బారావు చౌదరి మాట్లాడుతూ ఎప్పుడుచూసినా తెలుగుదేశం పార్టీపైనే పడి ఎడుస్తారేందుకని అన్నారు. దీంతో సమావే శంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జోక్యం చేసుకుని కౌన్సి లర్‌ సుబ్బారావుపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ నోరు అదు పులో పెట్టుకుని మాట్లాడకపోతే మర్యాదగా ఉండదని హెచ్చ రించారు. దీనిపై కౌన్సిలర్‌ సుబ్బారావు మాట్లాడుతూ తాను తప్పేమి మాట్లాడలేదని చెప్పడంతో తోట శాంతించారు. పట్ట ణంలోని టిడ్కో ఇళ్లకు సంబంధించి మౌలిక వసతులు కల్పించి ఎప్పుడు ఇస్తారనేదానిపై సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యులు మధ్య చర్చ జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచా రంలో సీఎం జగన్‌ టిడ్కో ఇళ్లను ఉచితంగా ఇస్తామని మామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మరిచారని ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్సీ తోట  మాట్లాడుతూ రూ.500 చెల్లించిన లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్లను రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తామన్నారు. మండపేట పట్టణంలో టిడ్కో ఇళ్లకు సంబంధించి జూలై 15వ తేదీ లేదా నెలాఖరుకు తొలివిడతలో 2,700 ఇళ్లను ఇస్తామన్నారు. 4వ వార్డులో సీసీ రోడ్డు ప్రారంభానికి తనను ఆహ్వానించలేదని టీడీపీ కౌన్సిలర్‌ గుండు రామతులసి చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకువచ్చారు. కౌన్సి లర్‌ పిల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ 29వ వార్డులో కనకదుర్గ ఆలయం ప్రక్క నుంచి శ్మశానవాటికకు వెళ్లే రోడ్డు ఆక్రమ ణలకు గురైందని, ఆక్రమణలు తొలగించి దారిని పునరు ద్ధరిం చాలని కోరారు.  ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ సచివాల యాల్లో ఓటీఎస్‌ రిజిస్ర్టేషన్లు చేయిం చిన ఇళ్లకు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్‌  చేయించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ టిడ్కో ఇళ్లకు సంబంధించి డబల్‌బెడ్‌రూమ్‌కు రూ.లక్ష, సింగిల్‌బెడ్‌రూమ్‌కు రూ.50వేలు లబ్ధిదారులు అప్పులుచేసి చెల్లించారని, ఈనగ దుకు వడ్డీలు చెల్లించలేక పోతున్నామని, దీనికితోడు ఇపుడు బ్యాంకు రుణానికి వడ్డీ ఎలా కట్టగలమని తన దృష్టికి లబ్ధిదా రులు తీసుకువచ్చినపుడు తాను కూడా బాధపడ్డానని అన్నారు. బ్యాంకు రుణం ఇచ్చిన నాటి నుంచి వడ్డీ చెల్లించాల్సి వస్తుందా లేదా తెలపాలని కౌన్సిలర్లు ప్రశ్నించారు. కమిషనర్‌ రామ్‌కుమార్‌ మాట్లాడుతూ లబ్ధిదారులకు మారటోరియం ద్వారా వడ్డీకి మినహాయింపు ఉంటుందన్నారు. పలు అంశా లను కౌన్సిల్‌ ఆమోదిం చింది. టిడ్కో ఇళ్లు రెండో దశకు సం బంధించి వాటర్‌ట్యాంకు, మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే వేగుళ్ల కోరారు. మున్సిపల్‌ వైఎస్‌ చైర్మన్లు పిల్లి గణే శ్వరరావు, నారయ్యబాబు, కౌన్సిలర్లు పోతంశెట్టి ప్రసాద్‌, కాళ్లకూరి స్వరాజ్యభవాని, చింతలపూడి భవాని, శిరంగు జ్యోతి, యార మాటి గంగరాజు, కాశినకాశి విశ్వనాధం, కోఆప్షన్‌ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ, సయ్యద్‌రబ్బాని పాల్గొన్నారు.



Updated Date - 2022-07-01T06:38:23+05:30 IST