Viral Video: కోతిని తినాలని సాహసం చేసిన పులి.. అష్టకష్టాలు పడి చెట్టెక్కింది.. చివరకు..

Published: Sat, 05 Mar 2022 18:11:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: కోతిని తినాలని సాహసం చేసిన పులి.. అష్టకష్టాలు పడి చెట్టెక్కింది.. చివరకు..

ఒకటి అనుకుంటే.. మరోటి అయ్యిందేంటి.. అని జీవితంలో చాలా సార్లు అనుకుంటూ ఉంటాం. కొన్ని సార్లు ఇలాగే చివరి నిముషంలో అనూహ్య  ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వణ్యప్రాణులకు కూడా ఇలాంటి అనుభవం తరచూ ఎదురవుతూ ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఓ అడవిలో చెట్టుపైన ఉన్న కోతిని వేటాడటానికి.. ఓ పులి ఎంతో సాహసం చేస్తుంది. చివరకు ఎలాగోలా చెట్టెక్కుతుంది. అయితే కోతిని పట్టుకునే క్రమంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న వీడియోలో ఓ అడవిలో కోతి తన పిల్లను ఎత్తుకుని చెట్టుపై సేద తీరుతూ ఉంటుంది. అదే సమయంలో ఓ పులి కింద నుంచి దాన్ని గమనిస్తుంది. ఈ పూటకు ఈ కోతిని తినేద్దాం.. అనుకుంటూ చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. కష్టంగా ఉన్నా ఎలాగోలా సర్కస్ పీట్లు చేసి పైకి ఎక్కుతుంది. మధ్యలో ఆపసోపాలు పడుతూ ఓ కొమ్మపై కొద్దిసేపు సేదతీరుతుంది. కొమ్మల చివరన ఉన్న కోతి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. పులి రాకను గమనించిన కోతి.. ‘‘దమ్ముంటే నన్ను పట్టుకో చూద్దాం’’ అన్నట్లుగా కొద్ది సేపు పులితో తమాషా చేస్తుంది. పులి సమీపానికి వచ్చే కొద్దీ.. కొమ్మల అంచుకు చేరుకుంటుంది. దాన్ని పట్టుకునేందుకు పులి కూడా కొమ్మల చివరకు వచ్చే ప్రయత్నం చేస్తుంది.

వరుస కాదని తెలిసినా బాలికపై వక్ర దృష్టి.. తల్లి, భార్య సహకారంతో చివరికి అతడు చేసిన పని..

ఈ క్రమంలో పట్టుతప్పి కిందకు జారిపడుతుంది. కోతి మాత్రం అక్కడి నుంచి చటుక్కున మరో కొమ్మపైకి వెళ్తుంది. అప్పటికే అలసిపోయి ఉన్న పులి.. కిందపడగానే మరింత అలసిపోతుంది. లేచి వెళ్లలేక కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకుంటుంది. ఈ ఘటనను మొత్తం అక్కడే వాహనాల మీద ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధిస్తారు. ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఈ వీడియో.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు.

మీ ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని పక్కింటోళ్లు అంటున్నా లేదని బుకాయించిందా భార్య.. పోలీసుల ఎంట్రీతో..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

వరుడి కోసం మండపంలో వధువు ఎదురుచూపు.. ఆర్భాటంగా రావాల్సిన పెళ్లికొడుకు అంబులెన్స్‌లో ఎంట్రీ.. అసలేం జరిగిందంటే.. Viral Video: పోట్లాడుకుంటున్న రెండు జింకలు.. మధ్యలో సడన్‌గా పులి ఎంట్రీ.. చివరకు ఏమైందో మీరే చూడండిvideoViral Video: కాలువలో చేప కనపడిందని సంబరపడ్డారు.. కాసేపు ఆగాక చూసి ఖంగుతిన్నారు.. video‘‘నీకో బహుమతి ఇస్తా, ఊరి బయటకు వచ్చెయ్’’.. అంటూ ప్రియురాలిని పిలిచిన యువకుడు.. మాట్లాడుతూ మాట్లాడుతూ..మీ అమ్మాయి స్కూల్‌కు రావట్లేదంటూ టీచర్ల ఫిర్యాదు.. తల్లిదండ్రులు నిలదీస్తే ఆ బాలిక చెప్పింది విని..ఆ పని చేయకపోతే నీ వీడియోలు బయటపెడతా.. అంటూ హెచ్చరించిన భర్త.. ఈ వ్యవహారం చివరకు ఎంత వరకు వెళ్లిందంటే..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.