vizianagaram: వామ్మో పెద్దపులి.. హడలిపోతోన్న గణపతినగరం వాసులు

ABN , First Publish Date - 2022-09-26T03:57:09+05:30 IST

జిల్లాలో పెద్ద పులి చెలరేగిపోతోంది. రోజుకోప్రాంతంలో సంచరిస్తూ హడలెత్తిస్తోంది. ప్రతి రోజూ ఏదో ఒక చోట మూగజీవుల్ని వెంటాడి వేటాడుతోంది. తాజాగా...

vizianagaram: వామ్మో పెద్దపులి.. హడలిపోతోన్న గణపతినగరం వాసులు

విజయనగరం: జిల్లాలో పెద్ద పులి చెలరేగిపోతోంది. రోజుకోప్రాంతంలో సంచరిస్తూ హడలెత్తిస్తోంది. ప్రతి రోజూ ఏదో ఒక చోట మూగజీవుల్ని వెంటాడి వేటాడుతోంది. తాజాగా గణపతినగరం మండలం వేమలి గ్రామంలోని ఓ రైతు పశువుల పాకలోకి పులి చొరబడింది. అక్కడనున్న మూగజీవాన్ని చంపింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిందో. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎప్పుడు, ఎటు నుంచి వస్తుందో తెలియనని.. పులి నుంచి తమకు ప్రాణ హాని ఉందని.. అటవీ అధికారులు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నాయి. అయితే అటవీశాఖ మాత్రం పులి పాదముద్రలను సేకరించడానికే అటవీశాఖ పరిమితమవుతోందనే విమర్శలు ఎదుర్కోవడం కొసమెరుపు.



Updated Date - 2022-09-26T03:57:09+05:30 IST