నల్లగొండ పరిసరాల్లో పులి!

Published: Wed, 06 Jul 2022 00:41:42 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నల్లగొండ పరిసరాల్లో పులి!కొత్తపల్లి కొండ దిగువ నల్లగొండ సమీపంలో పులి పాదముద్రలు

గాండ్రింపులు వినిపించాయంటున్న గ్రామస్థులు


కొయ్యూరు, జూలై 5: మండలంలోని కొప్పుకొండ నల్లగొండ గ్రామ అటవీ ప్రాంతంలో పెద్దపులి తిరుగాడుతున్నట్టు గ్రామస్థులు తెలిపారు. సోమవారం రాత్రి పాత నల్లగొండ గ్రామ సమీప కొత్తపల్లి కొండకు ఆనుకుని ఉన్న పల్లి చిన్నబ్బాయి చేనుపాకలు సమీపంలో పెద్దపులి గాండ్రింపులు వినిపించాయని చెబుతున్నారు. మంగళవారం ఉదయం ఆ ప్రాంతాన్ని పరిశీలించగా పులి పాదముద్రలు కనిపించాయి. నల్లగొండ నుంచి చింతాలమ్మ ఘాట్‌ పరిసరాలలో పులి సంచరిస్తున్నట్టు గ్రామస్థులు భావిస్తున్నారు. దీంతో వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా అటవీ అధికారులు సాయంత్రం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ పాదముద్రలు పులివి కాకపోవచ్చని తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.