ఫోటోలు తీసుకుంటున్న పర్యటకులకు అత్యంత సమీపంలోకి వస్తుంది..! పర్యటకుల గోలకు పులి చిరాకు పడిందా..? దానికి ఒక్కసారిగా తిక్కరేగిందా.. అన్నట్టు ఉంటుంది ఈ దృశ్యం! అక్కడున్న వారిలో ఒక్కసారిగా అలజడి.. నెక్ట్స్ ఏం జరుగుతుందా అని ఊపిరి బిగపట్టి చూస్తున్న తరుణంలో పులి తన దారిన తాను వెళ్లిపోతుంది. ఈ విషయాన్ని సుశాంత నందా తన ట్వీట్లో పేర్కొన్నారు. పులి తనను తాను నిగ్రహించుకుందంటూ కామెంట్ పెట్టారు. పర్యటకులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్న ఈ వీడియో..మీ కోసం..!