తునిలోకి అడుగుపెట్టిన పెద్దపులి

ABN , First Publish Date - 2022-06-28T04:22:44+05:30 IST

గత కొద్ది రోజులుగా అటవీ అధికారులను, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న పెద్దపులి తాజాగా తుని నియోజకవర్గంలోకి ...

తునిలోకి అడుగుపెట్టిన పెద్దపులి

కాకినాడ (Kakinada): గత కొద్ది రోజులుగా అటవీ అధికారులను, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న పెద్దపులి (Tiger) తాజాగా తుని నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం పులిమేరు కుమ్మరు లోవలో సంచరిస్తోంది. దాంతో స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేశారు. మరోవైపు పులి రాక నిజమేనని అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. అప్రమత్తంగా ఉండాలంటూ గ్రామస్తులకు సూచించారు. కొద్దకాలంగా కాకినాడ జిల్లాలోని మండలాల్లో పెద్ద పులి సంచరిస్తోంది. పశువులపై దాడి చేస్తోంది. అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులకు కూడా చిక్కడం లేదు. మత్తు ప్రయోగం కూడా విఫలమైంది. 


Updated Date - 2022-06-28T04:22:44+05:30 IST