నల్లమలలో 30 పులులు!

ABN , First Publish Date - 2022-05-26T09:18:13+05:30 IST

నాగర్‌కర్నూల్‌, మే25 (ఆంధ్రజ్యోతి): పులుల సంరక్షణ కోసం అ టవీశాఖ చేపడుతున్న చర్యలు స త్ఫలితాలనిస్తున్నాయి. కేంద్ర వన్యప్రాణుల సంరక్షణ సంస్థ

నల్లమలలో 30 పులులు!

నాగర్‌కర్నూల్‌, మే25 (ఆంధ్రజ్యోతి): పులుల సంరక్షణ కోసం అ టవీశాఖ చేపడుతున్న చర్యలు స త్ఫలితాలనిస్తున్నాయి. కేంద్ర  వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నల్లమల లో చేపట్టిన తాజా పులుల గణనలో ఈ విషయం వెల్లడైంది. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులో 2018లో నిర్వహించిన గణాంకాలతో పోల్చితే పులుల సంఖ్య 19 నుంచి 30కి పెరిగినట్లు అంచనా వేశారు. వీటిలో 7 నుంచి 8 పులికూనలు ఉన్న ట్లు కూడా నిర్ధారణ అయింది. వీటిలో మూడు ఆడపులి కూనలుండటంతో వచ్చే ఏడాదిలో నల్లమలలో పులుల సంఖ్య దాదాపు 50కి చేరుకుంటుందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ ఆధ్వర్యంలో ప్రతి నాలుగేళ్లకొకసారి దేశంలోని 50 టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులలో వైల్డ్‌లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా పులుల గణన చేపడుతున్న విషయం తెలిసిందే. నల్లమల అటవీ ప్రాంతం 2లక్షల 61వేల హెక్టార్లలో విస్తరించింది. పులుల సంరక్షణకు ఇక్కడ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులో అటవీ పరిరక్షణతో పాటు వేటగాళ్ల బారిన పడకుండా వన్యప్రాణుల్ని కాపాడేందుకు  650 మంది వాచర్లను నియమించారు.  నల్లమలలో నివసించే చెంచులకు జంతువులను వేటాడే స్వభావం లేకపోవడం కూడా  పులుల సంఖ్య పెరగడానికి దోహదపడిందని చెబుతున్నారు.

Updated Date - 2022-05-26T09:18:13+05:30 IST