భద్రాద్రిలో పులిగోర్ల పట్టివేత ?

Published: Tue, 21 Jun 2022 01:22:47 ISTfb-iconwhatsapp-icontwitter-icon

అటవీ అధికారుల అదుపులో నలుగురు నిందితులు

భద్రాచలం, జూన్‌ 20: భద్రాచలం పట్టణంలో సోమవారం పోలీసులు ఆరు పులిగోర్లను పట్టుకున్నారు. ముందస్తుగా అందిన సమాచారం మేరకు భద్రాచలంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో వారిని తనిఖీ చేయగా వారి వద్ద ఆరు పులిగోర్లు లభించించాయి. ఆ గోర్లను సదరు వ్యకు ్తలు విక్రయించే ప్రయత్నంలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. అనంతరం నిందితులతో పాటు ఆ గోర్లను పోలీసు అటవీశాఖ అధికారులకు అప్పగించారు. అటవీశాఖ అధికారు లు ఆ నలుగురిని విచారిస్తున్నట్లు సమాచారం. నిందితులు ఏపీలోని చింతూరుకు చెం దిన వారుగా సమచారం. అయితే ఆ నలుగురి వద్ద పట్టుకున్న పులిగోర్లు నిజమైనవేనా కాదా అనే విషయంపై స్పష్టత కోసం వాటిని పరీక్షించేందుకు హైదరాబా ద్‌లోని ల్యాబ్‌కు  పంపినట్లు తెలిసింది. వాటిపై స్పష్టత వచ్చేంతవరకు ఏమీ చెప్పలేమని అటవీశాఖ, పోలీసు అధికారులు తెలిపారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.