హీరోపంటికి టైగర్‌ సన్నద్ధం

May 31 2021 @ 00:07AM

‘హీరోపంటి’ చిత్రం ద్వారా బాలీవుడ్‌ అరంగేట్రం చేసిన టైగర్‌ష్రాఫ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకొన్నారు. ఇప్పుడు టైగర్‌ ఆ చిత్రానికి సీక్వెల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ముంబైలో తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌తో ఈ చిత్రం షూటింగ్‌ నిలిచిపోయింది. మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే లాక్‌డౌన్‌ ఎత్తేసే అవకాశం ఉండడంతో రెండో షెడ్యూల్‌ షూటింగ్‌కు సమాయత ్తమవుతున్నారు. ‘హీరోపంటి 2’లో విలన్‌గా నటిస్తున్న నవాజుద్దీన్‌ సిద్దిఖీ చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ చిత్రంలో తారా సుతారియా కథానాయికగా నటిస్తున్నారు. అహ్మద్‌ఖాన్‌ దర్శకుడు. ఏ.ఆర్‌ రెహ మాన్‌ సంగీతం అందించే అవకాశ ం ఉందని సమాచారం. డిసెంబర్‌ 3న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలా ప్రకటించారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.