లాక్‌డౌన్‌ ఎత్తేయగానే టైగర్‌ షూట్‌

Jun 1 2021 @ 04:31AM

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో త్వరలోనే లాక్‌డౌన్‌ ఎత్తేసే అవకాశాలు ఉన్నాయి. దాంతో  బాలీవుడ్‌ ప్రముఖులు సినిమా చిత్రీకరణలకు సన్నద్ధమవుతున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేయగానే ముంబైలో షూటింగ్‌ ప్రారంభించేందుకు ‘టైగర్‌ 3’ చిత్రబృందం సమాయత్తమవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్‌ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను సల్మాన్‌ ఖాన్‌, కట్రినా కైఫ్‌పై చిత్రీకరించనున్నారట. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్న యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ నటీనటులకు, షూటింగ్‌ సిబ్బందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి మనీష్‌ శర్మ దర్శకుడు. ఇమ్రాన్‌ హష్మీ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.