వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం సరికాదు

ABN , First Publish Date - 2020-09-17T11:10:49+05:30 IST

వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడమంటే రైతుల ఉసురు తీయడమేనని అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్ల రామకృష్ణ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో

వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం సరికాదు

సిరికొండ, సెప్టెంబరు 16: వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడమంటే రైతుల ఉసురు తీయడమేనని అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్ల రామకృష్ణ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మోటార్లకు మీటర్లు బిగిస్తే రైతులు విద్యుత్‌ బిల్లులు చెల్లంచలేక అప్పుల పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రైవేటు కంపెనీలకు కొనుగోలు చేసే అధికారం కల్పించే బిల్లు ఆమోదించడం దారణమన్నారు. బీజేపీ ప్రభుత్వం స్వదేశీ జపం చేస్తూ విదేశీ కంపెనీలకు వ్యవసాయ రంగాన్ని ధారదత్తం చేయడమేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాజేందర్‌, రమేష్‌, సాయారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


జిల్లాకేంద్రంలోని ధర్నా చౌక్‌లో..

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లాకేంద్రంలోని ధర్నాచౌక్‌లో నాయకులు కేంద్ర ప్రభు త్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ దండి వెంకట్‌ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల ను వ్యతిరేకించే నిజమైన దేశభక్తులపై కుట్రకేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి బెదిరింపులను పీడిత ప్రజాఉద్యమాల ద్వారా ప్రతిఘటిస్తామ ని హెచ్చరించారు.  కార్యక్రమంలో బీఎల్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు శ్యాంబాబు, ఎంసీపీఐయూ నాయకులు శ్రీనివాస్‌, సత్యనారాయణ, మధు, కేశవ్‌ పాల్గొన్నారు.


కార్మిక, కర్షక వ్యతిరేక బిల్లులను వెనక్కి తీసుకోవాలి

పెద్దబజార్‌: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కార్మిక, కర్షక వ్యతి రేక బిల్లును ఉపసంహరించుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో పులాంగ్‌ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర నాయకుడు పాపయ్య మాట్లాడుతూ.. దేశ జనా భాలో 65 శాతం ప్రజానీకం వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నా రు. ఆ రంగమే కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అనూకూల పెట్టుబడిదారులకు ధారదత్తం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో భూమన్న, ఏఐకేఎంఎస్‌ నగర అధ్యక్షుడు గంగాధర్‌, మల్లయ్య, సాయిలు, సాయిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-09-17T11:10:49+05:30 IST