బ్యాన్‌కు రెడీ అవుతున్న టిక్‌టాక్‌!

ABN , First Publish Date - 2020-08-08T21:06:56+05:30 IST

అమెరికాలో నిషేధానికి గురయ్యే అవకాశం ఉండటంతో టిక్‌టాక్ తగు ఏర్పాట్లు చేసుకుంటోంది.

బ్యాన్‌కు రెడీ అవుతున్న టిక్‌టాక్‌!

బీజింగ్: అమెరికాలో నిషేధానికి గురయ్యే అవకాశం ఉండటంతో టిక్‌టాక్ తగు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే యాడ్‌లు బుక్ చేసుకున్న ప్రకటనకర్తలకు అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇచ్చేందుకు సిద్ధమని టిక్‌టాక్.. ఆయా సంస్థలకు తెలియపరిచింది. మార్కెట్‌ నిపుణుల అంచనా ప్రకారం.. అమెరికాలో టిక్‌టాక్ యాడ్ బిజినెస్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. 2020లో ప్రకటనల ద్వారా ఒక బిలియన్ డాలర్లు అదాయం సమకూర్చుకోవాలని సంస్థ లక్ష్యం విధించుకుంది. అయితే కరోనా సంక్షోభం, తదనంతర పరిణామాల కారణంగా ఆ ప్రాణాళికలన్నీ తలకిందులయ్యాయి. ప్రస్తుతం నిషేధానికి గురయ్యే పరిస్థితినీ ఎదుర్కుంటోంది. అయితే ఇప్పటికే కుదుర్చుకున్న ప్రకటనల ఒప్పందాలన్నింటికీ వీలైనంత వరకూ కట్టుబడి ఉండే ప్రయత్నం చేస్తున్నామని టిక్‌టాక్ ప్రతినిధి తెలిపారు. అది కుదరని పక్షంలో ఆయా సంస్థలు డబ్బులు తిరగిచ్చేస్తామని తెలిపారు. అంతే కాకుండా.. ప్రస్తుతం టిక్‌టాక్‌పై ఆధారపడ్డ ఇన్‌ఫ్ల్యూయోన్సర్‌లు అందరినీ ఇతర వేదికలకు మళ్లేందుకు తగు సహాయం చేస్తామని కూడా ఆయన తెలిపారు.

Updated Date - 2020-08-08T21:06:56+05:30 IST