కర్లపాలెం సముద్రతీరంలో మత్స్యకారుల వలకు చిక్కిన తిమింగళం

ABN , First Publish Date - 2020-08-09T11:05:26+05:30 IST

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని కర్లపాలెం సముద్రతీరంలో మత్స్యకారుల వలకు అరుదైన తిమింగళం పడింది.

కర్లపాలెం సముద్రతీరంలో మత్స్యకారుల వలకు చిక్కిన తిమింగళం

గుడ్లూరు, ఆగస్టు 8: ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని కర్లపాలెం సముద్రతీరంలో మత్స్యకారుల వలకు అరుదైన తిమింగళం పడింది. గ్రామ మత్స్యకారుడైన లంకె శ్రీనివాసులు వలకు సముద్రంలో తక్కువగా కనిపించే తిమింగళం చిక్కుకోవడంతో గమనించిన అతను తిన్నగా ఒడ్డుకు చేర్చాడు.  తిమింగళం టన్నుపైన బరువు ఉంటుందని, దీనిని చెన్నైకి ఎగుమతి చేస్తే రూ.2లక్షల వరకు ధర పలుకుతుందని అన్నారు. ప్రస్తుతం తాడుతో కట్టేసే తిమింగళాన్ని భద్రపరిచారు. కరోనా నేపథ్యంలో కొనుగోలుకు ఇతర ప్రాంతాల వ్యాపారులు రాకపోవడంతో కొంత ఇబ్బందిపడాల్సి వస్తుందని కర్లపాలెం గ్రామపెద్ద చాపల రమణయ్య ఈ సందర్భంగా వివరించారు. అరుదుగా సముద్రంలో కనిపించే ఈ తిమింగళాన్ని చూసేందుకు చుట్టుపక్కల భారీగా తరలివచ్చారు. 

Updated Date - 2020-08-09T11:05:26+05:30 IST