IAS Topper టీనా దబీ నిశ్చితార్థం

Published: Tue, 29 Mar 2022 11:28:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
IAS Topper టీనా దబీ నిశ్చితార్థం

న్యూఢిల్లీ: 2015 ఐఎఎస్ టాపర్ అయిన టీనా దబీ త్వరలో పెళ్లి కూతురు కానున్నారు. తాజాగా తనకు 2013 బ్యాచ్ ఐఎఎస్ అధికారి ప్రదీప్ గవాండేతో నిశ్చితార్థం జరిగిందని టీనా దబీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన చిత్రాలను పంచుకుంటూ పోస్టు పెట్టారు. టీనా దాబీ 2015లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచారు. అదే సంవత్సరం జమ్మూకశ్మీరుకు చెందిన అథర్ ఖాన్ రెండవ స్థానంలో నిలిచారు.ఇద్దరు ఐఎఎస్ టాపర్ల మధ్య ప్రేమ చిగురించడంతో వారు 2018వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.అప్పట్లో వారి వివాహానికి ప్రముఖులు, అగ్ర రాజకీయ నాయకులు హాజరయ్యారు. 

IAS Topper టీనా దబీ నిశ్చితార్థం

అనంతరం గత ఏడాది చివరిలో అథర్ ఖాన్‌తో టీనాదబీ విడాకులు తీసుకున్నారు. 1.4 మిలియన్లకు పైగా ఫాలోయర్లతో సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లో ప్రజాదరణ పొందిన టీనా దబీ తనకు కాబోయే భర్త ప్రదీప్ తో కలిసి ఉన్న రెండు చిత్రాలను ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. నిశ్చితార్థం చేసుకున్న కాబోయే దంపతులు టీనాదబీ, ప్రదీప్ గవాండేలు ఒకరికొకరు చేతులు పట్టుకొని కూర్చున్న ఫొటోను టీనా దబీ పంచుకున్నారు. ఈ చిత్రాలను కాబోయే భర్త ప్రదీప్ కు కూడా ట్యాగ్ చేశారు. ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయిన దబీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడంతోపాటు ఫస్ట్ ర్యాంక్ సాధించి అందరి దృష్టినీ ఆకర్షించారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.