చిన్న విమానంలో... ఒంటరిగా... ప్రపంచాన్ని చుట్టేసింది...

ABN , First Publish Date - 2022-01-21T23:03:59+05:30 IST

చిన్న విమానం., అందులో ఆమె ఒక్కతే., అయితేనేం... ధైర్యంగా... ఏకంగా... ప్రపంచాన్నే చుట్టేసింది. ఈ సాహసం చేసింది.

చిన్న విమానంలో... ఒంటరిగా... ప్రపంచాన్ని చుట్టేసింది...

బెల్జియం యువతి సాహస యాత్ర... 

బ్రస్సెల్స్ : చిన్న విమానం., అందులో ఆమె ఒక్కతే., అయితేనేం... ధైర్యంగా... ఏకంగా... ప్రపంచాన్నే చుట్టేసింది. ఈ సాహసం చేసింది. బెల్జియం దేశానికి చెందిన ఓ యువతి. ఆమె సాహస యాత్రకు ప్రపంచమే ఫిదా అయ్యింది. ఈ క్రమంలో... స్వదేశంలో... ఆ యువతి ఇప్పుడో హాట్ టాపిక్. సామాన్యుని నుండి మొదలుకుని దేశ సారధుల వరకు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. సెలెబ్రిటీల స్థాయిలో ప్రశంసల వర్షం కురుస్తూనే ఉండడం విశేషం. ఇక వివరాలిలా ఉన్నాయి. 


బెల్జియం కు చెందిన యువతి తన చిన్న విమానంలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేసి, గిన్నిస్ రికార్డ్ లో చోటు సంపాదించింది. పంతొమ్మది సంవత్సరాల జరా రూథర్ఫోర్డ్ తన కలను సాకారం చేసుకోవడానికి ఈ సాహసం చేసింది. గతేడాది ఆగస్టు 18 న బెల్జియం నుంచి తన చిన్న విమానంలో సాహస యాత్రకు శ్రీకారం చుట్టిన జరా... ఈ క్రమంలో... 199 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టేసి, తిరిగి ఈ నెల 20(గురువారం)న బెల్జియంకు చేరుకుంది. 


అతి చిన్న వయసులో ఒంటరిగా... 52 దేశాలు, అయిదు ఖండాల్లో ప్రయాణించి వచ్చిన ఘనతను జరా సాధించారు. ఇక... తిరుగు ప్రయాణంలో ఆమె భారత దేశం మీదుగా స్వదేశానికి చేరుకున్నారు. తన సాహసం ఇతర యువతులకు స్పూర్తినిస్తుందన్న ఆశాభావాన్ని జరా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంొటే... జరా స్ఫూర్తితో... బెల్జియంలోనే కాకుండా, పలు దేశాలకు చెందిన యువతులు ఇలా సాహసయాత్రల బాట పడుతున్నట్లు వినవస్తోంది. 

Updated Date - 2022-01-21T23:03:59+05:30 IST