టిప్పర్ల రాకపోకల అడ్డగింత

ABN , First Publish Date - 2021-02-28T03:29:17+05:30 IST

బుచ్చి పెద్దూరు బెస్తపాళెంలో శనివారం కనిగిరి రిజర్వాయర్‌ సమీపం నుంచి గ్రావెల్‌ తరలించే టిప్పర్లను స్థానికులు అడ్డుకున్నారు

టిప్పర్ల రాకపోకల అడ్డగింత
టిప్పర్లను అడ్డుకున్న అడ్డుకున్న బెస్తపాళెం మహిళలు

బుచ్చిరెడ్డిపాళెం,ఫిబ్రవరి27: బుచ్చి పెద్దూరు బెస్తపాళెంలో శనివారం కనిగిరి రిజర్వాయర్‌ సమీపం నుంచి గ్రావెల్‌ తరలించే టిప్పర్లను స్థానికులు అడ్డుకున్నారు. రాత్రింబవళ్లు వందల సంఖ్యలో టిప్పర్లతో గ్రావెల్‌ తరలిస్తున్నారు.దీంతో ఇంట్లో నుంచి తమ పిల్లలు వీధిలోకి వచ్చే పరిస్థితి లేదని స్థానికులు పేర్కొన్నారు. టిప్పర్ల రాకపోకలతో  దుమ్ము రేగి ఇళ్లతోపాటు ఇంట్లో దుస్తులు, గృహోపకరణాలు, వంటలన్నీ మట్టి పాలౌతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామని నగర పంచాయతీ కమిషనర్‌ శ్రీనివాసరావు, ఎస్సై ప్రసాద్‌రెడ్డి ముందు వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నచ్చజెప్పినా ససేమిరా అంటూ టిప్పర్లను గంటపాటు అడ్డుకున్నారు. దీంతో  ట్రాఫిక్‌ స్తంభించింది. ఆఖరికి నీళ్లు చల్లించేందుకు కమిషనర్‌, ఎస్సై చర్యలు చేపట్టడంతో వారు అడ్డు తొలగారు. వెంటనే ఓ నీళ్ల టాంకర్‌తో బెస్తపాళెంలో రోడ్డుమీదంతా నీళ్లు చల్లించారు.


Updated Date - 2021-02-28T03:29:17+05:30 IST