కండరాల పరిమాణం పెరిగేందుకు..
ABN , First Publish Date - 2020-10-04T05:30:00+05:30 IST
బరువు తగ్గడం కన్నా బరువు పెరగడం కొందరికి కష్టంగా తోస్తుంది. బరువు పెరగాలనే ఆలోచనతో కొందరు జంక్ ఫుడ్, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారం తింటూ ఉంటారు. దాంతో టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, గుండె సంబంధ జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది...
బరువు తగ్గడం కన్నా బరువు పెరగడం కొందరికి కష్టంగా తోస్తుంది. బరువు పెరగాలనే ఆలోచనతో కొందరు జంక్ ఫుడ్, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారం తింటూ ఉంటారు. దాంతో టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, గుండె సంబంధ జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీరు సరైన ఫుడ్, వెయిట్ ట్రైనింగ్, కండరాలను దృఢంగా మలచుకోవడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం మీద దృష్టి పెట్టాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు...
- వ్యాయామాలు చేసి ఖర్చుచేసే 300-500 క్యాలరీలను అదనంగా తీసుకోవాలి.
- సరిపడా ప్రొటీన్ ఫుడ్ తినాలి. అప్పుడే కండరాలు వృద్ధి చెందుతాయి. కిలో శరీర బరువుకు 1.5 నుంచి 2 గ్రా. ప్రొటీన్ తీసుకోవాలి. గుడ్లు, చేపలు, చికెన్, పాలు, పాల ఉత్పత్తులు, లెగ్యూమ్స్, నట్స్, గింజలలో ఆరోగ్యానికి మేలు చేసే ప్రొటీన్ ఉంటుంది. దాంతో తొందరగా ఆకలి వేయదు. అయితే వీటితో పాటు కొద్దిమోతాదులో కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, ఫైబర్ ఉన్న ఆహారం తినాలి.
- కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్... ఇవి పండ్లు, కూరగాయలలో ఎక్కువగా లభిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వు లభించే నెయ్యి, అవకాడో, ఆలివ్ నూనె, కొబ్బరి నూనె, ఆముదం నూనె వంటివి బరువు పెరిగేలా చేస్తాయి.
- రోజులో ఎక్కువ సార్లు కొద్ది కొదిగా తినడం వల్ల బరువు పెరుగుతారు. భోజనం విరామాల మధ్య పాలతో పాటు శక్తినిచ్చే నట్స్, గింజలు తినాలి.
- బరువులు ఎత్తడం వల్ల అదనపు క్యాలరీలు కొవ్వుగా మారవు. కండరాల పరిమాణం పెరుగుతుంది. వారంలో రెండు లేదా నాలుగు సార్లు బరువులు ఎత్తడం వల్ల బరువు పెరుగుతారు.