పుట్టుమచ్చలు వెలసిపోయేలా చేసే చిట్కాలు!

ABN , First Publish Date - 2022-04-26T17:03:50+05:30 IST

ముఖం, ముంజేతులు, మెడ, ఛాతీ మీద పుట్టుమచ్చలు ఇబ్బంది పెడుతుంటే, ఆ మచ్చలను వెలసిపోయేలా చేసే చిట్కాలను పాటించాలి. ఇందుకోసం....

పుట్టుమచ్చలు వెలసిపోయేలా చేసే చిట్కాలు!

ఆంధ్రజ్యోతి(26-04-2022)

ముఖం, ముంజేతులు, మెడ, ఛాతీ మీద పుట్టుమచ్చలు ఇబ్బంది పెడుతుంటే, ఆ మచ్చలను వెలసిపోయేలా చేసే చిట్కాలను పాటించాలి. ఇందుకోసం....


యాపిల్‌ సెడార్‌ వెనిగర్‌: దూది ఉండను యాపిల్‌ సెడార్‌ వెనిగర్‌లో ముంచి, పుట్టుమచ్చ మీద ఉంచాలి. దీని మీద బ్యాండ్‌ ఎయిడ్‌ అంటించి, ఐదారు గంటల పాటు వదిలేయాలి. ఇలా మచ్చ రంగు వెలసిపోయేవరకూ చేయాలి. యాపిల్‌ సెడార్‌ వెనిగర్‌లోని యాసిడ్లు మచ్చను వెలిసిపోయేలా చేస్తాయి. 


బేకింగ్‌ సోడా: ఆర టీస్పూను బేకింగ్‌ సోడాలో ఐదారు చుక్కల ఆముదం కలిపి, ఈ ముద్దను పుట్టుమచ్చ మీద పూసుకోవాలి. బ్యాండ్‌ ఎయిడ్‌తో కప్పి రాత్రంతా వదిలేయాలి. ఇలా మచ్చ వెలసిపోయేవరకూ చేయాలి. బేకింగ్‌ సోడాతో మచ్చ పొడిగా తయారై, క్రమేపీ చర్మపు రంగులో కలిసిపోతుంది.


అరటి తొక్క: మచ్చ మీద అరటి తొక్క లోపలి భాగాన్ని ఉంచి, బ్యాండ్‌ ఎయిడ్‌ లేదా టేప్‌తో పట్టువేయాలి. ఇలా మచ్చ వెలసిపోయేవరకూ ప్రతీ రాత్రీ క్రమం తప్పకుండా చేయాలి. అరటి తొక్కలోని సహజసిద్ధమైన ఎంజైములు, యాసిడ్లు పుట్టుమచ్చ రంగును పలుచన చేస్తాయి.


వెల్లుల్లి: వెల్లుల్లిని మెత్తగా దంచి మచ్చ మీద పట్టు వేయాలి. ఇలా కనీసం మూడు వారాల పాటు చేస్తే పుట్టుమచ్చ వెలసిపోతుంది. 

Updated Date - 2022-04-26T17:03:50+05:30 IST